- ఏపీ దేశానికి రోల్ మోడల్ కావాలి
- ఫోరెన్సిక్ లేబోరేటరీల్లో సౌకర్యాలు
- ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలి
- హోంశాఖ కార్యదర్శి గోవింద్‌మోహన్
- సీఎస్, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్
అమరావతి(చైతన్యరథం): నూతన క్రిమినల్ చట్టాల పటిష్ట అమలుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఢల్లీి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాలతో వీడియో సమావేశం నిర్వహించారు. మన దేశంలో కొత్త క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధీని యం అమలులోకి వచ్చాయి. ఈ నూతన క్రమినల్ చట్టాలను క్షేత్రస్థాయి లో పటిష్టవంతంగా అమలు చేసేందుకు వివిధ పోలీ సుస్టేషన్లు, కోర్టులు, జైళ్లు, ఫోరెన్సిక్ లేబరేటరీల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోరెన్సిక్ ఎకో సిస్టమ్‌ను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలను మరింత పటిష్టం చేసే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వాటిలో వివిధ ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హులైన వారిని కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయాలని చెప్పారు. నూతన క్రిమినల్ చట్టాల అమలులో ఏపీ దేశానికి రోల్ మోడల్‌గా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
నేరం జరిగిన ప్రాంతాల్లో అనగా సీన్ ఆఫ్ అఫెన్స్‌లో పూర్తిగా ఆడియో వీడియో చిత్రీకరణ చేయాలని, అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఇ-సాక్ష్యంలో పొందుపర్చాలని డీజీపీకి సూచించారు.నూతన క్రిమినల్ చట్టాల పటిష్ట అమలుకు సంబంధించి కోర్టు రూములు, జైళ్లు, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు తదితర చోట్ల వీడియో కాన్ఫరెన్స్ విధానం అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, జీరో ఎఫ్‌ఐఆర్, ఇ-ఎఫ్‌ఐఆర్, మానిటంరింగ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్, వివిధ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీల ఆధునికీకరణ, తగిన సిబ్బంది ఏర్పాటు, సిటిజన్ సెంట్రిక్ ప్రొవిజన్స్ అయిన ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్ సేవలను సీసీటీ ఎన్స్ ఇంటిగ్రేషన్, ఫిర్యాదు దారులకు ఎస్‌ఎంఎస్ అలెర్టులు పంపించడం వంటి అంశాల్లో ఏపీ పోలీసులు చేపట్టిన ఏపీ పోలీస్ సేవా, సిటిజన్ పోర్టల్, శక్తి యాప్ వంటి వినూత్న చర్యలను ప్రశంసించారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ కలెక్టరేట్లు సహా డివిజన్, మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో వీడియో కాన్పరెన్సింగ్ విధానం ఇప్పటికే అందుబాటులో ఉందని చెప్పా రు. డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా మాట్లాడుతూ సీన్ ఆఫ్ అఫెన్స్ ప్రాంతాల్లో నూరు శాతం ఆడియో, వీడియో చిత్రీకరణకు చర్య లు తీసుకుంటున్నట్టు చెప్పారు. అదేవిధంగా అన్ని ఎఫ్‌ఐఆర్లను ఈ-సాక్ష్యంలో నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ వీడియో సమావేశంలో జైళ్ల శాఖ డీజీ అంజనీకుమార్, శాంతి భద్రతల అదనపు డీజీ ఎన్.మధుసూదన్‌రెడ్డి, జైళ్ల శాఖ డీఐజీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.