- ఇదే కూటమి ప్రభుత్వ విధానం
- పబ్లిసిటీ కంటే రియాలిటీకే మా ప్రాధాన్యం
- ఐదేళ్లుగా విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం
- సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రగతి పథంలో సాగుతున్నాం
- ఆరు నెలల పాలనపై ఎక్స్‌లో మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): ప్రచారానికి దూరంగా ప్రజా ప్రయోజనాలే పరమార్థంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడిరచి.. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూనే, రాష్ట్రానికి భారీస్థాయిలో పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా.. ఎంత వీలైతే అంతత్వరగా అమలు చేసేందుకు కృషిచేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా గురువారం ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ స్పందించారు. ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వ పాలన, సాధించిన లక్ష్యాలు, వైసీపీ పాలనలో అధోగతిపాలయిన రాష్ట్రాన్ని ఏ విధంగా పునర్నిర్మిస్తున్నారో వివరించారు.
రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయ్యింది. ఐదేళ్లలో విధ్వంసమైన రాష్ట్రం, అస్తవ్యస్తమైన వ్యవస్థలు, అప్పులు వారసత్వంగా వచ్చాయి. సంక్షోభాలను అవకాశాలుగా తీసుకొని సంక్షేమంగా మలిచే చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచీ రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తోంది. పిచ్చిపిచ్చి రంగులు ఉండవు.. మా బొమ్మలు కనిపించవు.. పబ్లిసిటీ కంటే రియాలిటీకే మా ప్రాధాన్యం. ‘రాష్ట్రమే ఫస్ట్…ప్రజలే ఫైనల్’ అనే నినాదం.. కూటమి ప్రభుత్వ విధానంగా అమలు చేస్తూ ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. అందరి సహకారంతో స్వర్ణాంధ్ర – 2047 విజన్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనింపజేస్తామని మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు.