- ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం
- వికసిత భారత్ స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం..
- శక్తివంతమైన భారత్ నిర్మాణంలో భాగస్వాములవుతాం
- మోడీ పీపుల్స్ మ్యాన్…. పేదవాడి కళ్లలో వెలుగుకు రూపం
- విశాఖపట్నం సభలో రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి లోకేష్
విశాఖపట్నం (చైతన్య రథం): గత ప్రభుత్వ అసమర్థతతో వెంటిలేటర్‌పైకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఆక్సిజన్ అందిస్తున్నారని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖపట్నం ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ వేదికనుంచి రూ.2లక్షల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ వర్చువల్‌గా శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ప్రస్తుతం ప్రతి నెలా రూ.4 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఏపీ ప్రభుత్వం నడుస్తోంది. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆక్సిజన్ అందిస్తున్నారు. అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.12157 కోట్ల కేంద్రంనుంచి సాయం అందించారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతనే భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు వేగవంతమయ్యాయి. ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు. వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి 5 ఏళ్లు తీసుకున్న గత ప్రభుత్వాన్ని చూసాం. కానీ చంద్రబాబు ఒకే ఒక్క సంతకంతో వెయ్యి రూపాయలమేర పెన్షన్ పెంచారు. మూసేసిన అన్న క్యాంటీన్లు తెరిచాం, దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, త్వరలోనే మెగా డీఎస్సీ, త్వరలోనే జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నారు. దటీజ్ సీబీఎన్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో ఈరోజు సువర్ణాధ్యాయం’ అని లోకేష్ వ్యాఖ్యానించారు.
వికసిత్ భారత్ స్ఫూర్తితోనే స్వర్ణాంధ్ర 2047
బ్యూటీఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం తరపున ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం. ప్రతి భారతీయుడి గుండెల్లో చోటు సంపాదించిన మోదీవైపు ప్రపంచమంతా చూస్తోంది. నరేంద్రమోడీ పీఎం అనే పదానికి అర్థాన్ని మార్చేశారు. పీఎం అంటే ప్రైమ్ మినిస్టర్, కాని నరేంద్ర మోదీ పీపుల్స్ మ్యాన్. నరేంద్ర మోదీజీ విజన్ గ్లోబల్. అయినా అతని హృదయం మాత్రం పేద ప్రజలతోనే ఉంటుంది. నమో అంటే పేదవాడి నమ్మకం, పేదవాడి భరోసా, దేశానికి ధైర్యం. పేదల చిరునవ్వు, మహిళల ఆత్మగౌరవం, యువత భవిత, అన్నదాత కళ్ళలో ఆనందానికి ప్రతిరూపం మోదీజీ. వికసిత్ భారత్ `2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి 2047కి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చెయ్యాలనే లక్ష్యంతో మోదీజీ పనిచేస్తున్నారు.
2014నాటికి ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ నేడు 5వ స్థానానికి వచ్చింది. వికసిత్ భారత్ -2047 లక్ష్యంతో టాప్ 1 లేదా 2 ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని మార్చేందుకు మోదీ కృషి చేస్తున్నారు. నరేంద్ర మోదీ వికసిత్ భారత్ స్ఫూర్తితో మన సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర -2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసారు. దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు. చంద్రబాబు విజన్ `2020 అంటే ఎంతోమంది నవ్వారు, వెటకారంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్లి చూస్తే ఆయన విజన్ 2020లో చెప్పిన ప్రతి మాట నిజమైంది. వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, రెన్యువబుల్ ఎనర్జీ, పోర్ట్స్, ఎయిర్‌పోర్ట్స్, స్పోర్ట్స్ ఇలా అన్ని రంగాల్లో నిర్ణీత లక్ష్యాలతో ముందుకు వెళ్లడమే స్వర్ణాంధ్ర `2047 ముఖ్యోద్దేశం’ అని లోకేష్ అన్నారు.
స్థిరమైన ప్రభుత్వాలు కొనసాగితేనే అభివృద్ధి
‘ఈరోజు చరిత్రలో నిలిచిపోతుంది. రాష్ట్ర దశ దిశ మార్చే ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక విశాఖ రైల్వే జోన్. గత ప్రభుత్వం కనీసం భూమి కేటాయించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విశాఖ రైల్వే జోన్ ట్రాక్ ఎక్కింది. నేడు మోదీజీ దానికి శంకుస్థాపన చేశారు. రూ.1.85 లక్షల కోట్లతో పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, రూ.1877 కోట్లతో నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్. రూ.10,500 కోట్లతో కృష్ణపట్నంలో పరిశ్రమల ఏర్పాటు, రూ.8016 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు… ఇంకా అనేక కార్యక్రమాలకు మోదీజీ శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రజల తరపున నరేంద్ర మోదీజీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. స్థిరమైన ప్రభుత్వ కొనసాగింపు అభివృద్ధికి చాలా ముఖ్యం. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. మూడోసారి దేశంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిరది.
అందుకే దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచించాలి. 2014 -19 వరకూ ఎన్డీయే ప్రభుత్వంలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో మీకు తెలుసు. తరువాత 2019-24 నడుమ జరిగిన విధ్వంసం కళ్లారా చూశారు. అదే ఎన్‌డిఎ ప్రభుత్వం కొనసాగించి ఉంటే రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్‌పై మోడీజీ చూపుతున్న ప్రేమ, అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌లోని డబుల్ ఇంజన్ సర్కారు వేగవంతమైన ఆర్థికాభివృద్ధి సాధిస్తూ, శక్తివంతమైన భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం వహించబోతోంది. ఆంధ్రప్రదేశ్‌కు మీరు పెద్దన్నలా సహకారం అందించండి. వికసిత్ భారత్ `2047 లక్ష్యాల సాధనలో మేం భాగస్వాములం అవుతాం. రాష్ట్రాలు బలోపేతమైతేనే జాతి బలంగా తయారవుతుందని నేను నమ్ముతాను. ప్రస్తుతం భారత్‌లో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఎక్కడ చూసినా ‘‘నమో’’ మేనియా మార్మోగుతోంది’ అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.