అమరావతి (చైతన్యరథం): దివ్యాంగుల కోసం విశాఖపట్నంలో రూ.200 కోట్లతో 20 ఎకరాల్లో స్టేడియం నిర్మిస్తున్నట్టు రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల శాఖ మంత్రి డా. డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, పలువురు విభిన్న ప్రతిభావంతులు మంగళవారం వెలగపూడి సచివాయంలో మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కలిసి 7 వ రాష్ట్ర పారా అథ్లెటిక్ చాంపియన్ షిప్ `2025 పోటీలకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…….దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్లు, ఫోన్లు, త్రీ వీలర్స్ ఇస్తున్నామని చెప్పారు. దివ్యాంగుల పింఛను రూ. 6 వేలకు పెంచాం. మంచానికే పరిమితమైన వారికి నెలకు రూ. 15,000 ఇస్తున్నాం. దివ్యాంగ విద్యార్థులకు పింఛన్ ప్రతినెల వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి డోలా తెలిపారు.