- దందాపై విచారణ జరిపించి చర్యలు తీసుకోండి
- ప్రజావినతుల కార్యక్రమంలో బాధితుడి ఫిర్యాదు
- భూ కబ్జాలు, ఆక్రమణపైనా వెల్లువెత్తిన వినతులు
- అర్జీలు స్వీకరించిన పల్లా, పెమ్మసాని, అచ్చెన్నాయుడు
మంగళగిరి(చైతన్యరథం): తోట చంద్రయ్య బంధువునంటూ గతంలో వెల్దుర్తి ఎస్సై గా పనిచేసిన వంగా శ్రీహరి తీవ్రంగా ఇబ్బందులు పెట్టి తమ వద్ద రూ.1,00,000 తీసు కున్నాడని పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన తోట ఆం జనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను కూడా పార్టీ మారమని ఇబ్బందులు పెట్టా డని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన ప్రజా వినతుల కార్యక్రమంలో నేతలకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఆయన పొన్నూరు టౌన్‌లో పనిచేస్తున్నాడని, ఎస్సై అక్రమాలపై విచారణ జరిపించి తమ డబ్బులు తమకు ఇప్పించి చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశే ఖర్, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు అర్జీలు స్వీకరించారు.
` తనకు నంద్యాలలో ఉన్న ఐదు సెంట్ల స్థలాన్ని శ్రీనివాసరెడ్డి, తిరుపతిరెడ్డి ఆక్రమించుకున్నారని నంద్యాల జిల్లా పెరుసోముల గ్రామానికి చెందిన షేక్ ఖాదర్ సాహెబ్ ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకుని స్థలాన్ని కబ్జా నుంచి విడిపించాలని కోరాడు.
` తమ భూమిని దొప్పర్ల గ్రామ వైసీపీ సర్పంచ్ తప్పుడు పత్రాలతో కబ్జా చేసి వేరేవాళ్లకు అమ్ముకున్నాడని.. దీనిపై విచారించి అతనిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దొప్పర్లకు గ్రామానికి చెందిన కొరుపోలు రమణ ఫిర్యాదు చేశాడు.
` తమ గ్రామంలో తన తాత పేరుపై ఉన్న భూమిని మాజీ వైసీపీ సర్పంచ్ జక్కిరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి ఆక్రమించుకున్నాడని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడి మర్రు గ్రామానికి చెందిన జొన్నలగడ్డ ఇజ్రాయిల్ ఫిర్యాదు చేశాడు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని విన్న వించుకున్నాడు.
` తనను చంపి తన ఇంటిని ఆక్రమించుకునేందుకు రుద్ర శ్రీనివాసరావు, బత్తుల శ్రీనివాసరావు యత్నిస్తున్నారని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన గడ్డం శివకుమారి ఫిర్యాదు చేశారు. వారిపై గతంలో బైండోవర్ కూడా పెట్టారని, తనకు, తమ కుటుంబానికి వారి వల్ల ప్రాణహాని ఉందని, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
` తమ ప్రాంతంలో బాలికల విద్యాభివృద్ధికి జూనియర్ ఉమెన్స్ కళాశాలను ఏర్పాటు చేయాలని చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం రాయలపేట గ్రామానికి చెందిన కె.చంద్రయ్య వినతిపత్రం అందజేశారు.
` తమకు ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో ఉన్న పొలాన్ని తహసీల్దారు రాజకుమారి అక్రమంగా తనకు తెలియకుండా మరొకరి పేరుమీదకు మార్చారని గుంటూరుకు చెందిన కొమ్మినేని పద్మజ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి ఆమెపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని విన్నవించింది.
` తమకు వారసత్వంగా వచ్చిన భూమిని వైసీపీ కబ్జాదారులు ఆక్రమించు కున్నారని పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం ఇరపు గ్రామానికి చెందిన పూసపాటి పుల్లారావు, పూసపాటి చంద్రశేఖర్ రావు, పూసపాటి వీర బ్రహం ఫిర్యాదు చేశారు. వారి కబ్జా నుంచి తమ భూమిని విడిపించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.