ప్రతి సంవత్సరం ఆగస్టు 12న ప్రపంచం అంతటా అంతర్జాతీయ యువ దినోత్సవాన్ని జరుపుకొంటాము. దీనిని 1999 లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత సమస్యలు, అవకాశాలు, అభివృద్ధి లక్ష్యాలను గుర్తించి, యువత శక్తిని ప్రపంచ అభివృద్ధి కోసం మలచడమే యువదినోత్సవ ప్రధాన ఉద్దేశ్యం. యువతకు విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక న్యాయం వంటి రంగాలలో అవగాహన కల్పించడం.. ప్రభుత్వాలు, పౌర సమాజం, యువజన సంస్థలు కలిసి యువత కోసం కార్యాచరణ చేపట్టేలా ప్రోత్సహించడం లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నారు. ఇది యువత లోపల నిగూఢంగా ఉన్న సామర్థ్యాన్ని గుర్తించేందుకు, ప్రోత్సహించేందుకు, వారి సమస్యలను ప్రపంచానికి చాటేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దినం. ప్రపంచంలో ఉన్న యువత ఏ విధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులకు నాయకత్వం వహిస్తున్నారో తెలియజేయడం దీని ఉద్దేశం. యువత సమాజానికి శక్తి, సృజనాత్మకత, మార్పునకు చిహ్నం. వారి ఆలోచనలు, కృషి దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఆత్మ విశ్వాసం, శ్రమ, నీతి, విజ్ఞానం కలిగిన యువతే అభివృద్ధికి బాటలు వేసే శక్తివంతమైన శక్తి. యువత తన బలహీనతలను అధిగమిస్తూ, తన బలాలను వినియోగించుకుంటూ, మరింత సుస్థిరం చేసుకుంటూ సమాజం పై తమ దైన ముద్రను బలంగా వేస్తూ, ఆదర్శవంతంగా రూపుదిద్దుకోవాలి.
యువత తమను తాము స్పష్టంగా తెలుసు కోగలిగితే విజేతలు అవుతారు. విజేతలందరూ భిన్నంగా ఆలోచించి, విభిన్నంగా తమ కార్యక్రమాలను విజయ లక్ష్యంతో నడిపించి యువతకు దారి చూపించారు. ఏమి కావాలో, దానికి ఏం చేయాలో ప్రణాళికబద్ధంగా పనిచేస్తూ తమలోని ప్రత్యేకతలను గుర్తెరిగి వాటిని పదునెక్కించారు. నలుగురితో కలిసి పనిచేస్తూ నలుగురినీ కలుపుకుంటూ, అందరితో ప్రేమపూర్వకంగా మెలిగారు. ఆహం తగ్గించుకున్నారు. తాము చేసే పనిని ప్రేమించారు. ఆనందంగా, కర్తవ్యదీక్షగా తమ పని తాము చేశారు. సంక్లిష్టతను, సంక్షోభాన్ని సవాలుగా స్వీకరించారు. సవాళ్ళలోనించి, ప్రతిభను ప్రజ్వలనం చేశారు. కొత్త ఆలోచనలు చేశారు. వాటిని ఆచరించారు. అభివృద్ధికి కారకులయ్యారు. కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. వాటిని అధిగమించారు.
తమ చుట్టూ ఉన్న వారిలోని ప్రజ్ఞను గుర్తించారు. ఎప్పటికప్పుడు తమను తాము సమీక్షించుకున్నారు. సంస్కరించుకున్నారు. విలువల విలువను తెలుసుకున్నారు. నియమబద్ధంగా, నిర్మాణాత్మకంగా ఆలోచించారు. వైఫల్యాలను దాటారు. అలసత్వాన్ని దరి చేరనీయలేదు. తప్పులను సరి చేసుకుంటూ కర్తవ్య నిర్వహణ చేసారు. వారి అడుగుజాడల్లో మారుతున్న అవసరాలకు అనుగుణంగా యువత ఆలోచించాలి. వేగంగా పని చేయాలి. లక్ష్యాలను సాధించాలి. గమ్యాన్ని చేరుకోవాలి. మానవ జన్మను మహనీయం చేసుకోవాలి. ప్రతి అడ్డంకీ ఒక ఎక్కవలసిన మెట్టు అని నేటి యువత గుర్తించాలి. సమాజం అభివృద్ధి పథంలో పయనించాలంటే యువత పాత్ర ప్రధానమైంది. క్రమశిక్షణకి అగ్ర తాంబూలం ఇవ్వాలి. ప్రవర్తనా సరళికి కొత్త మెరుగు దిద్దుకోవాలి. నీతిని, నిజాయితీని దుస్తులుగా ధరించాలి. దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి కోసం యువత నడుం బిగించటం అత్యవసరం.
యువనేత లోకేష్ పాదయాత్రకు గత ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తగ్గేదే లేదంటూ పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన ముందుకు సాగిన తీరు టీడీపీ కేడర్ లో నూతనోత్సాహాన్ని నింపింది. లోకేష్ తన పోరాట పటిమ ద్వారా తన నాయకత్వ లక్షణాలపై ఉన్న అపోహలను తొలగించుకొన్నారు. ఆయనను ప్రత్యర్థులు ఎంత గా అవహేళన చేశారో ప్రజలు చూసారు. ఆ అవమానాలనే ఆయన సవాళ్లుగా స్వీకరించారు. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ఒక మెచ్యూర్డ్ నాయకుడిగా ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ప్రజా నాయకుడుగా తనను తాను ప్రజల ముందు ఆయన ఆవిష్కరించుకున్నారు. నేటి యువతే రేపటి నాయకులు. ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ అద్భుత తెలివైన యువ నాయకుడు. యువత అవసరాలను హృదయపూర్వకంగా అర్థం చేసుకొని యువత భవితకు బంగారు బాటలు వేస్తున్న నాయకుడు ఆయన. నేడు యువతకు ప్రేరణ కలిగిస్తున్నారు.
ఆయన రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి యువతకు ఉద్యోగాలు, డిజిటల్ విజన్, స్టార్టప్‌లకు ప్రోత్సాహం, స్కిల్లింగ్ వంటి విషయాల్లో విశేష శ్రద్ధ చూపిస్తున్నారు. విదేశీ విద్యతో ఉన్నతంగా ఆలోచించే ఆయన, రాష్ట్రంలో వున్న యువతకు సాంకేతిక విజ్ఞానం, ఉద్యోగావకాశాలు, ఆధునిక వ్యవస్థల పై అవగాహన కలిగించేలా పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. లోకేష్ తన విద్యాభ్యాసాన్ని అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో పూర్తిచేసారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందిన ఆయనకు ఆర్థిక, వ్యూహాత్మక, టెక్నాలజీ రంగాల్లో విశేష అవగాహన వుంది. టెక్నాలజీని, అభివృద్ధినీ కలపగలిపే నూతన తరహా నాయకత్వం ఆయనలో ఉన్నది. ప్రపంచస్థాయి విద్యావ్యవస్థ అనుభవం ఆయన నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. యువతతో ఆత్మీయంగా మమేకమయ్యే నాయకుడిగా తనను తాను స్థిర పర్చుకున్నారు. ప్రత్యేకంగా యువతకు ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమాలు తీసుకురావడంలో ఆయన ముందున్నారు. టెక్నాలజీతో అభివృద్ధి, యువతతో పాలన అన్న భావనను ఆచరణలోకి తీసుకువస్తున్న యువ నాయకుడు లోకేష్.
యువతకు మార్గదర్శి. ఆయనలో పాలనలో నూతన దృక్కోణం, నూతన ఆలోచనలత, పరిపక్వత ఉన్నాయి. 2019 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయి పార్టీ పై నిర్బంధం కొనసాగినప్పటికీ లోకేష్ వెనుకడుగు వేయలేదు. ఆయనలో ఉన్న దృఢ సంకల్పం, ఓర్పు, వ్యూహాత్మక ఆలోచన, ప్రజా సమస్యలపై స్పందించే తీరు విలక్షణమైనవి. ప్రత్యర్థులు కఠిన విమర్శలు, వ్యక్తిగత దూషణలకు దిగినా వాటికి డేటా ఆధారాలతోనే సమాధానం ఇచ్చారు. 3,000 కిలోమీటర్లకు పైగా చేసిన పాదయాత్రలో ప్రతి అడుగుకు ఒక సమస్యను వినిపించారు. ప్రతి గ్రామంలో ఒక సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు. తప్పుడు కేసులైనా, విమర్శలైనా లోకేష్ అడుగులు ఆగలేదు. ప్రతి నిర్ణయంలో గణాంకాలు, ఆధారాలు, వాస్తవాలకే ప్రాధాన్యం ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం అధికారుల స్థాయి వరకు వెళ్లి తక్షణ చర్యలు తీసుకోవడం ఆయన ప్రత్యేకత. నిజం కోసం నిలబడే దృఢ సంకల్పం, ప్రజల కోసం ఎన్ని త్యాగాలైనా చేయాలనే అంకిత భావానికి ప్రతి రూపం లోకేష్. ఐటీ, ఇన్నోవేషన్, స్టార్టప్ పాలసీల రూపకల్పనలో ఆయన పాత్ర ప్రశంసనీయమైనది. రాష్ట్రంలో 20 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పనే లక్ష్యంగా పెట్టుబడులు ఆకర్షించేందుకు శ్రమిస్తున్నారు నారా లోకేష్.
తమ భవిష్యత్ ను తీర్చి దిద్దు కోవాల్సిన బాధ్యత యువతదే. నేడు నిజం తెలుసు కొని యువత పట్ల బాధ్యతగా వ్యవహరించే వారికి మద్దతుగా నిలవాలి.యువత తలుచుకొంటే సాధ్యం కానిది లేదు. యువతీ,యువకులు రాష్ట్రంలో నిర్ణాయక శక్తులుగా ఎదిగి తమ భవిష్యత్‌కి మేలు బాటలు వేసుకోవాలి. యువ నాయకుడు లోకేష్ రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆయన దృష్టి అంతా యువత అభివృద్ధి మీదే నిలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్ ద్వారా లక్షలాది మంది యువతకు ఆధునిక నైపుణ్యాలు నేర్పించారు. ఉద్యోగాలు మాత్రమే కాదు, స్వయం ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తూ స్టార్ట్‌అప్‌లు, ఇన్నోవేషన్ హబ్‌లను ప్రోత్సహిస్తున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, పర్యాటకం, రోబోటిక్స్ వంటి రంగాల్లో శిక్షణా కేంద్రాలు ఏర్పరచి, ప్రపంచ స్థాయి పోటీకి యువతను సిద్ధం చేస్తున్నారు. యువతకు కేవలం డిగ్రీ కాదు డిజిటల్ పరిజ్ఞానం కూడా ఉండాలని లోకేష్ లక్ష్యం. అందుకే ఆయన Aూ జశ్రీశీబస నబప, Iశీు జవఅ్‌వతీం, AI ుతీaఱఅఱఅస్త్ర ూaపం వంటి ప్రాజెక్టులు తీసుకువచ్చారు.
వీటి ద్వారా గ్రామీణ ప్రాంతాల యువత కూడా గ్లోబల్ జాబ్స్ పొందే స్థాయికి చేరుకుంటున్నారు. కేవలం శిక్షణ ఇవ్వడంతో ఆగిపోలేదు. యువత సమస్యలు వినడానికి కూడా ఎప్పుడు అందుబాటులో ఉండే నేతగా నిలిచారు. నిరుద్యోగ భృతి, ఉపాధి అవకాశాల పెంపు, పారదర్శక రిక్రూట్‌మెంట్ విధానాలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. యువత సమాజానికి జీవకళ. రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తు. దానిని మరింత బలంగా, వెలుగులీనేలా తీర్చిదిద్దే శక్తి, దిశా నిర్దేశం ఇవ్వగల నాయకుడే నారా లోకేష్. ఆయన చూపే మార్గం కేవలం ఒక తరం కోసం కాదు, రాబోయే తరాల భవిష్యత్తు కోసం పటిష్టమైన బాటలు వేస్తున్నారు. విద్యతోపాటు యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. ఐటీ రంగం అభివృద్ధి కోసం తండ్రికి మించిన తనయుడిగా కృషి చేస్తున్నారు. ప్రగతిశీల ఆలోచనలతో రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలను ప్రోత్సహిస్తూ నవ్యాంధ్రను పరుగు తీయిస్తున్నారు లోకేష్. రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా మార్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 12న ప్రపంచ అంతర్జాతీయ యువ దినోత్సవం సందర్భంగా యువతకు శుభాకాంక్షలు.