- ‘ఈగల్’ తరహాలో ఐజీ స్థాయి అధికారితో ఏర్పాటు
- మహిళా దినోత్సవాన సీఎం చేతులమీదుగా ‘శక్తి యాప్’
- రిమోట్ ఏరియాలో కూడా పనిచేసే విధంగా రూపకల్పన
- వైసీపీ పాలనలో ప్రచారానికి మాత్రమే దిశ పరిమితం
- దానికి చట్టబద్ధత ఎక్కడుంది? ఎంతమందిని కాపాడారు?
- మండలిలో వైసీపీ సభ్యులకు హోంమంత్రి అనిత కౌంటర్
అమరావతి(చైతన్యరథం): మహిళలు, చిన్నారుల భద్రత కోసం ‘ప్రత్యేక రక్షణ విభా గం’ ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడిరచారు. ‘ఈగల్’ తరహాలో ఐజీ స్థాయి ఐపీఎస్ అధికారి దీనికి నేతృత్వం వహిస్తారని తెలిపారు. రాజకీ యాలకతీతంగా వారికి రక్షణ చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. మహిళల భద్రత విషయంలో రాజీపడబోమన్నారు. దిశ యాప్‌తో గత ప్రభుత్వంలో రక్షణ ఉండేదన్న వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. దిశ చట్టం కింద ఫిర్యాదు చేసిన కేసు ఒక్కటైనా ఉందా? ‘దిశ’ కేవలం ప్రచారానికే పరిమి తమైంది.. ఐదేళ్లలో దిశ చట్టాన్ని ఎందుకు చేయలేదు? అంటూ సూటిగా ప్రశ్నించారు. దిశ యాప్‌కు చట్టబద్ధత ఎక్కడుంది? ఎంతమందిని యాప్ ద్వారా కాపాడారు? వివరా లు చెప్పాలని డిమాండ్ చేశారు. వేధింపులు జరిగితే దిశ చట్టం కింద ఫిర్యాదు చేసిన కేసు ఒక్కటైనా ఉందా? అని అడిగారు. వైసీపీ ప్రభుత్వంలో పస లేని దిశ చట్టాన్ని పక్కన పెట్టి సరికొత్తగా శక్తి యాప్‌ని తీసుకువస్తున్నట్లు హోంమంత్రి అనిత మండలిలో ప్రకటించారు. నెట్‌వర్క్ లేని రిమోట్ ప్రదేశాల్లో కూడా పనిచేసేలా ప్రత్యేకంగా యాప్ ని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు చేతులమీదుగా ‘శక్తి యాప్‘ను ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు.
పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం 2013 పీఓఎస్‌హెచ్ చట్టం అమలవుతోం దని వెల్లడిరచారు. 2019-24 వరకూ ఈ చట్టం కింద 85 కేసులు నమోదైనట్లు తెలి పారు. 41ఎ సీఆర్ పీసీ/35(3) కింద 72 మందికి బీన్‌ఎస్‌ఎస్ నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మొత్తం ఈ చట్టం ప్రకారం అందిన ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేసి కేసు నమోదు చేసి 24 మందిని అరెస్ట్ చేశామని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అడిగిన ప్రశ్నకు హోంమంత్రి అనిత సమాధానం చెప్పారు. 2024 సెప్టెంబర్ నుంచి 2025 జనవరి వరకూ కమిటీలకు వచ్చిన ఫిర్యాదులు మొత్తం 50 అని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2024లో మొత్తం 30 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 23 మందికి నోటీసులివ్వగా ఐదుగురిని ఇప్పటివరకూ అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. వేధింపులు, దాడులకు పాల్పడిన వారిపై ఫిర్యాదు చేయడానికి జిల్లా స్థాయి స్థానిక ఫిర్యా దు కమిటీ, అంతర్గత ఫిర్యాదు కమిటీ అందుబాటులో ఉంటాయన్నారు. ప్రతి పది మం ది మహిళలతో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం ఉంటుందని తెలియజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలలో ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీలు 6,681 గా తేల్చి చెప్పారు. రాష్ట్ర పునర్ విభజన తర్వాత ఏపీ వ్యాప్తంగా 26 ఎల్సీ, ఐసీ కమిటీలు ఏర్పాటయ్యాయన్నారు. స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పని ప్రదేశాల్లో రక్షణకు సంబంధించిన చట్టపరమైన పరిణామాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. ఏదైనా ఇబ్బంది జరిగినపుడు చెప్పుకోవడానికి భయపడి ఆగిపోకుండా అవగాహన కలిగించి వారికి న్యాయం చేస్తామనే భరోసా అందిస్తామన్నారు. స్త్రీ,శిశు సంక్షేమ శాఖను అడగాల్సిన ప్రశ్నలను వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి హోంమంత్రిని అడుగుతున్నారన్నారు. ఏ ప్రశ్న ఎవరిని అడగాలో అవగాహనతో ఉంటే బాగుంటుందన్నారు. శాసన మండలిలో మంగళవారం వైసీపీ ఎమ్‌ఎల్‌సీలు వరుదు కళ్యాణి, ఏసురత్నంల ప్రశ్నలకు హోంమంత్రి అనిత ధీటుగా బదులిచ్చారు.