- ఆలోచనలు రంగరించడంలో దిట్ట
- అమ్మ నారా భువనేశ్వరి చెప్పిన సత్యం
- విద్యారంగానికి మహర్దశ
- కోకొల్లలుగా ఉపాధి అవకాశాలు
- ఆరునెలల్లోనే పండుగ వాతావరణం
- బడి నుండి ఉద్యోగం దాకా
అమరావతి, (చైతన్యరథం): మా అబ్బాయి అని చెప్పడం కాదు గానీ.. లోకేష్ వాళ్ల నాన్న కన్నా చురుకైన వాడు. ఈ మాట అన్నది పవరో కాదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి ఓ బహిరంగ సభలో చెప్పిన మాట. పవరో వందిమాగధులు చెబితే కొట్టి పారేయవచ్చు. అనుచరులు, స్నేహితులు, సన్నిహితులు అన్నారంటే ముఖస్థుతి అనుకుని వదిలేయవచ్చు. కానీ నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో కాకలు తీరిన చంద్రబాబు సహధర్మచారిణిగా ఆయన పదుర్కొన్న ఎన్నో ఒడిదుడుకులను, విజయాలను దగ్గరగా చూసిన భువనేశ్వరి.. ఉగ్గుపాల నుండి పెంచి పెద్ద చేసిన కన్నతల్లిగా తనయుడి గురించి అన్న ఒక్క మాటను తరచి చూస్తే కళ్లముందు కదలాడుతున్న వాస్తవాలకు నిలువెత్తు రూపంగా లోకేష్ నిలుస్తారనడంలో అతిశయోక్తి కనిపించదు.
తండ్రి మదిలో ఏదో ఆలోచన కదలాడుతోందని పసిగడితే చాలు.. ఆది సాకారం చేయడమే తన విద్యుక్త ధర్మమని మనసా, వాచా , కర్మణా పాటిస్తున్నారు లోకేష్. రాజకీయం, పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం పక్కడ చూసినా తండ్రి చంద్రబాబు నీడలో తనయుడి లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అంతర్జాతీయ విపణిలో ఆరితేరిన మల్టీనేషనల్ కంపెనీలతో జరిగే చర్చల్లో యువమంత్రి లోకేష్ మాట్లాడితే కంపెనీల యజమానులు, ప్రతినిధులు మంత్రముగ్ధులవుతున్నారనేందుకు.. ఇటీవల గూగుల్ కంపెనీ రాక, మిట్టల్ అండ్ కో సహా తరలి వస్తున్న పరిశ్రమలు, వెల్లువలా వస్తున్న పెట్టుబడులు నిదర్శనం.
సీఎం మదిలో కదిలే ఆలోచనల రూపమే లోకేష్
మెగా డీఎస్సీ ద్వారా ఆరునెలల్లో టీచర్ పోస్టుల భర్తీ అంటే సమయం సరిపోతుందా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ అధికారులు, ఉపాధ్యాయులు, యూనియన్ లీడర్లు, నిరుద్యోగులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అంతా ఆశ్చర్యపోయేలా చకచకా జరుగుతున్న పనులు ఆయన ఆలోచనల్లో అవగాహన, అమల్లో చురుకుదనానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. మెగా డీఎస్సీ ప్రకటన, వెన్నంటి మెగా పేరెంట్స్, టీచర్స్ సమ్మేళనం, మరోపక్క మౌలిక సదుపాయాల కల్పన, టీచర్లు బోధనపైనే దృష్టి కేంద్రీకరించడానికి వీలుగా బోధనేతర పనుల భారం తగ్గిస్తూ, పాఠశాలల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చిన 117 జీవో రద్దు, ఇలాంటి మార్పులు చేర్పులు, చివరకు విద్యార్థులకు ప్రాథమిక పాఠశాలల్లో ఎలాంటి మెనూ అమలు చేయాలి, హైస్కూళ్లలో పలాంటి మెనూ, హాస్టళ్లలో ఎలాంటి మెనూ అంటూ సవివరంగా నిధులు, విధులను అప్పగిస్తున్న మంత్రి లోకేష్ పనితీరుతో సంక్రాంతి పండుగ ముందే వచ్చేసినట్లుందని ముఖ్యమంత్రి నుంచి అధికారులు టీచర్లు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు చివరకు యూనియన్ నాయకులు కూడా ముక్తకంఠంతో చెప్పడం చురుకైన యువమంత్రి పని తీరుకు నిదర్శనం.
ఆయన అనుభవాలే కార్యాచరణకు మార్గాలు
మా నాన్న అప్పటికే రాష్ట్రానికి టీచర్ కాబట్టి నా స్కూల్ కి రావడానికి ఆయనకి టైం ఉండేది కాదు. పిల్లల్లో నాకు దేవుడు కనిపిస్తాడు. పిల్లలంతా నా కొడుకు దేవాన్ష్ లాగే అనిపిస్తారు. మా వాడు హైదరాబాద్.. నేను అమరావతి. వాడితో ఆడుకోవడం కూడా కుదరడం లేదు. ఎంత ఒత్తిడిలో ఉన్నా…ఎన్ని పనులు ఉన్నా..పిల్లలు కనిపిస్తే నేను ఆగిపోతాను. సరదాగా కాసేపు వాళ్లతో ఆడుకుంటాను. పిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యాశాఖ మంత్రిని కావడం నా అదృష్టం. ఏ వృత్తి చేపట్టిన వారైనా వారిని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. ఉపాధ్యాయులంటే నాకు ఎంతో గౌరవం. జాతిపిత మహాత్మాగాంధీజీ చెప్పినట్లు విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందని మా ప్రభుత్వం బలంగా నమ్ముతోందని మంత్రి లోకేష్ చెప్పడం సత్తా గల నాయకుడికే సాధ్యం. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మా ప్రభుత్వానికి రంగులు, ఫోటోల పిచ్చి లేదని స్పష్టం చేస్తూ, ఆయన మంత్రి అయిన వెంటనే ఫోటోలు, రంగులు తీసేయమని ఆదేశాలు జారీ చేశారు. స్కూల్స్ లో ఒక్క జాబ్ మేళాలు తప్ప ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదు అని నిర్ణయం తీసుకున్నారు.
రాజకీయ కార్యక్రమాలకు పిల్లల్ని తీసుకు వెళ్ళకూడదని స్పష్టంగా చెప్పారు. విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలా మన చరిత్రను, సంస్కృతిని గుర్తుచేసేలా విద్యారంగంలో విశేష సేవలందించిన వ్యక్తుల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టి వాటిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నంలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రూ. 944 కోట్లతో ఉచితంగా‘‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్స్’’పంపిణీ చేశారు. ‘‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం’’క్రింద లక్షలాది మంది విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన, ఆయా ప్రాంతాల ఆహార అలవాట్లను గౌరవిస్తూ పౌష్టికాహారం అందించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఉపాధ్యాయులు చదువు మాత్రమే చెప్పాలి, మరుగుదొడ్లు, భోజనం ఫోటోలు తీయడం వారి బాధ్యత కాదని చెబుతూ, దీనిపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. కేజీ టూ పీజీ కరిక్యులం మార్చడానికి సిద్ధమయ్యారు. చదువుతో పాటు నైతిక విలువలు చాలా ముఖ్యమని, మహిళల్ని గౌరవించడం చిన్న వయస్సు నుండే నేర్పించాలని నిర్ణయించారు,
మార్పు అవసరం
కొందరు చేతికి గాజులు వేసుకున్నావా అని మాట్లాడతారు, అమ్మాయి లా ఏడవకు అని అంటారు. ఈ మాటలు విన్న ప్రతి సారి నాకు బాధ వేస్తుంది. ఇవన్నీ పోవాలి. ఆడ, మగ సమానం అనే భావన కలిగేలా ప్రత్యేక పాఠ్యాంశాలు తీసుకొస్తామంటూ పిల్లల్లో నైతిక విలువలు పెంచడం కోసం నైతిక విలువల సలహాదారునిగా చాగంటి కోటేశ్వర రావును నియమించారు. ఆయన మార్గదర్శనంలో పత్యేక పాఠాలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను 4స్టార్ రేటింగ్ కు తీసుకురావాలన్న సిఎం ఆదేశాలను పాటిస్తాం. మిషన్ మోడ్ లో కార్యక్రమం చేపడుతున్నాం. ఇందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం అవసరం. విద్యార్థులు, తల్లితండ్రులు, టీచర్లే నా బ్రాండ్ అంబాసిడర్లు. దాతలు, పూర్వవిద్యార్థులు, స్వచ్ఛందసంస్థలు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు అంతా కలిసి పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని యువమంత్రి లోకేష్ ఇచ్చిన పిలుపును అందుకుంటే చదువుల తల్లి సాత్కారించినట్లే. ఆ పిలుపు అక్కడితో ఆగలేదు. ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన అల్యుమిని సదస్సులో ఆయన చేసిన ప్రసంగం వెల్లడిరచిన వ్యూహం, ప్రకటించిన ప్రణాళిక సీనియర్లను సైతం ఆలోచింప జేస్తోంది.
ఆంధ్ర యూనివర్శిటీని అంతర్జాతీయ స్థాయిలో మేటిగా నిలపాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని ఆంధ్రా యూనివర్సిటీ అంతర్జాతీయస్థాయి విద్యా సంస్థగా ఆవిర్భవించాలన్న తన కోరిక జోక్ లేదా మ్యాజిక్ కాదని ప్రభుత్వం, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యావేత్తలు, ప్రత్యేకించి పూర్వ విద్యార్థులు, పారిశ్రామికవేత్తల సమష్టి కృషితో భవిష్యత్తులో ఎయు ప్రపంచస్థాయి విద్యాసంస్థగా ఆవిర్భవించడం సాధ్యమేనన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
పకడ్బందీ ప్రణాళిక
ఇప్పటివరకు ఉన్నత విద్యా వ్యవస్థలో లోపాల కారణంగా గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివిన విద్యార్థులను ఉద్యోగానికి సిద్ధం చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిన మాట వాస్తవం. అమీర్‌పేట్‌లోని ఇతర చోట్ల శిక్షణా కేంద్రాల్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థులు 3-4 నెలల్లో ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. నాలుగేళ్లు ఉన్నత విద్య అభ్యసించిన వారు ఎందుకు ఆవిధంగా తయారుకాలేక పోతున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం స్కిల్ సెన్సస్ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఇందులో పౌరులందరి నైపుణ్యాలతో కూడిన ప్రొఫైల్స్ ను క్రోడీకరించి, నైపుణ్య అంతరాలను గుర్తిస్తారు. ఆయా ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యం, రీస్కిల్లింగ్ కోసం నైపుణ్య శిక్షణ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులందరి ప్రొఫైల్‌ల అభిరుచి, ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తారు. వారికి అవసరమైన శిక్షణ కోసం మెంటార్ పరిశ్రమకు కనెక్ట్ చేసి ఉద్యోగానికి సిద్ధం చేస్తారు.
రాష్ట్రంలో పటిష్టమైన సాంకేతిక పర్యావరణ వ్యవస్థను ఏర్పాటుచేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా గూగుల్ గ్లోబల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టేందుకు ఎపి ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది.కేవలం ఆరునెలల్లో ఇవన్నీ జరగడంలో సీఎం చంద్రబాబు ప్రోత్సాహం, లోకేష్ చొరవ అవగాహనతో కలిసి వచ్చిన అధికారుల సహకారం వెరసి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి శుభసూచకమే.