- స్వేచ్ఛావాయువులు అందించిన దార్శనికుడు అంబేద్కర్
- ప్రజాస్వామ్య స్ఫూర్తి, మనుగడ రాజ్యాంగ ఫలమే
- రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో వక్తల ఉద్ఘాటన
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో పాల్గొన్న నాయకులు
మంగళగిరి(చైతన్యరథం): భారత రాజ్యాంగంతోనే సామాజిక న్యాయం సాధ్యమవు తుందని టీడీపీ నాయకులు ఉద్ఘాటించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, జాతిపిత మహాత్మాగాంధీ, నందమూరి తారకరామారావు చిత్రపటాలకు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించిన రోజు.. ప్రతిఏటా ఈరోజును మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. మన రాజ్యాంగా న్ని మనం గౌరవించుకునే అవకాశం రావడం గర్వకారణంగా ఉంది.. ప్రపంచంలోనే గొప్ప లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగం ఉండడం మరో గర్వకారణమన్నారు. భారత రాజ్యాంగం ఆమోదం పొంది నేటికీ 75 ఏళ్లు పూర్తి అయింది..
ఎందరో మేధావుల కృషితో సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా భారతావనిని నిలబెట్టేలా రాజ్యాంగాన్ని రూపొందించి భారత ప్రజలకు స్వేచ్ఛా వాయువులను అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలో ఎన్నో మతాలు, కులాలు, జాతులు కలిసి మనుగడ సాగిస్తున్నాయంటే అది రాజ్యాంగం గొప్ప తనమేనని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటంలో రాజ్యాంగం పాత్ర కీలకమ ని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రేరణతో 2015 నుంచి ఏటా రాజ్యాంగ దినోత్స వం నిర్వహిస్తున్నామని చెప్పారు. దార్శనికుల త్యాగాలు, శ్రమ ఫలితంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజ నేయులు, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, ఏపీ బయోడైవర్శిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్, వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ విజయ్‌కుమార్, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.