- రాష్ట్ర శాంతిభద్రతల పరిరక్షణే కీలకం
- మత్తుపై ఉక్కుపాదం మోపండి
- నేర నియంత్రణలో సాంకేతికత సాయం
- యాక్సిడెంట్ ప్రోన్‌పై దృష్టి పెట్టండి
- రాష్ట్ర పోలీస్‌కు సీఎం చంద్రబాబు ఆదేశం
అమరావతి (చైతన్య రథం): గత ప్రభుత్వ పాలనతో ప్రజానమ్మకానికి దూరమైన పోలీస్ శాఖ.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజా నమ్మకాన్ని చూరగొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. మహిళలు, చిన్నారుల రక్షణకు పోలీసింగ్ ఫెన్సింగ్ కావాలన్నారు. యువత డ్రగ్స్, గంజాయిలాంటి మత్తుబారిన పడకుండా నిఘా పెంచాలన్నారు. సైబర్ సేఫ్టీ, మిస్సింగ్ కేసులు, రహదారి భద్రత, ఆస్తుల పరిరక్షణవంటి అంశాలపై రాష్ట్ర పోలీసులు ప్రధానంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గడిచిన ఆరు నెలల్లో రాష్ట్రంలో నేరాలు తగ్గి, పోలీసింగ్‌పై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. సీసీ టీవీలు, డ్రోన్లు, ఏఎఫ్‌ఐఎస్, ఏఐవంటి అత్యాధునిక సాంకేతికత వినియోగించుకుని స్మార్ట్ పోలీసింగ్ అలవర్చుకోవాలన్నారు. రాష్ట్రంలో రానున్న మూడు మాసాల్లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోకి రావాలని, నేరాల నియంత్రణలో సాంకేతికతను పూర్తిగా వినియోగించాలన్నారు. పబ్లిక్ స్థలాలు, ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్ తదితరచోట్ల సిసి టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి రియల్ టైం మానిటరింగ్ చేయాలన్నారు. సీసీ కెమెరాలు కవరేజి లేనిచోట్ల డ్రోన్ల ద్వారా పర్యవేక్షించాలని, పోలీసులు చురుగ్గా పనిచేస్తే నేరస్తులు ఇనేక్టివ్ అవుతారని, పోలీసులు ఇనేక్టివైతే నేరస్తులు యాక్టివ్ అవుతారని, ఈ విషయాన్ని పోలీసులు గుర్తు పెట్టుకుని చురుగ్గా పని చేయాలని సూచించారు. గతంలో నేరస్తులను నేరస్తులుగానే చూశాం… కానీ నేడు నేరస్తులు రాజకీయ ముసుగులో పని చేస్తున్నారని హెచ్చరిస్తూ.. నేరాల నియంత్రణలో సైబర్ సెక్యూరిటీ విభాగం క్రియాశీలకం కావాలన్నారు. నేరస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని, రాష్ట్రంలో వివిధ యాక్సిడెంట్ హాట్‌స్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.
శాంతి భద్రతలపై డీజీపీ పవర్ ప్రజెంటేషన్
రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీ ద్వారకాతిరుమల రావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు.. రాష్ట్రంలో క్రైమ్ హాట్‌స్పాట్స్, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో, పబ్లిక్ ప్రదేశాల్లో ఇప్పటివరకు 15,587 కెమేరాలు ఏర్పాటు. వీటి ఆధారంగా 1,330 కేసుల గుర్తింపు.
కృష్ణా జిల్లా కంకిపాడులో సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా పట్టుబడ్డ బైక్ దొంగలు. రూ.20 లక్షల విలువైన 38 బైకులు స్వాధీనం. సీసీ టీవీ కెమేరాల కారణంగా కేవలం ఒక్క హెడ్ కానిస్టేబుల్ పర్యవేక్షణతో దొంగల గుర్తింపు.
ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ వినియోగించుకోవడం ద్వారా ఇట్టే పట్టుబడుతున్న నేరగాళ్లు.
తిరుపతిలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం,హత్య.. పాలకొల్లులో 73 ఏళ్ల వృద్ధురాలిపై హత్యాచారం వంటి కేసులను సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్.
1,238 రౌడీ షీట్లు, 215 డ్రగ్ సస్పెక్ట్ షీట్లు నమోదు, 858 క్రైమ్ హాటస్పాట్స్ గుర్తింపు.
రాష్ట్రంలో ఆరు నెలల్లో 7.78 శాతం తగ్గిన హత్యలు, 8.47 శాతం తగ్గిన దాడులు.
ఏలూరు జిల్లా పోలీసులు 25మంది నిందితులు దొంగిలించిన 251 బైకులను స్వాధీనం చేసుకున్నారు.
ఆధ్యాత్మిక క్షేత్రాలు, మతపరమైన ప్రదేశాల్లో నేరాలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ.
ఒక్క శ్రీకాకుళం జిల్లాలో 38 ఆలాయాలను కొల్లగొట్టిన దొంగల నుంచి రూ. 1.72 కోట్లు రివవరీ. 120 కేసులు నమోదు.
మూడేళ్ల నుంచి నిర్మానుష్యంగా ఉండే పవిత్ర ఆలయాలను టార్గెట్ చేసుకుని ఏపీ, తెలంగాణలోని 43 ఆలయాల్లో దొంగతనం చేసి పట్టుబడ్డ ముగ్గురు నిందితులు.
వైట్ కాలర్ నేరగాళ్లు, సైబర్ క్రైమ్‌కి పాల్పడే వాళ్లనుంచి రూ. కోట్లల్లో రికవరీ.
డిజిటల్ అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేస్తున్న నిందితులపైనా ఫోకస్.
విద్యార్ధులు, ప్రజల్లో చైతన్యం కోసం రాష్ట్రంలో సైబర్ అవేర్‌నెస్ డ్రైవ్.
సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నవారిపై ఇప్పటివరకు 572 కేసులు నమోదు. 210మంది అరెస్ట్. 345 మంది హాండ్లర్లు గుర్తింపు.
రాష్ట్రంలో మహిళలపై ఆరునెలలుగా 10.76 శాతం తగ్గిన నేరాలు.
4,988 మంది మిస్సింగ్ కేసులును చేధించారు. 1,350 మంది యువతులను కాపాడటం జరిగింది.
రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మాఫియాకు చెక్ పెట్టేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. ఈగల్ ద్వారా పర్యవేక్షణ. డ్రోన్లు, శాటిలైట్ దృశ్యాల ద్వారా గంజాయి సాగు గుర్తింపు.
ఇప్పటివరకు 14,787 కిలోల గంజాయి సీజ్. 627మంది రాష్ట్ర-అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్ట్.
రాష్ట్రంలో యువత డ్రగ్స్‌కి బానిసకాకుండా సంకల్పం పేరుతో ‘బీ స్మార్ట్ `డోంట్ స్టార్ట్’ నినాదంతో అవగాహనా కార్యక్రమాలు. 321 కాలేజీల్లోని 37 వేలమంది విద్యార్ధుల్లోనూ, 900 కార్యక్రమాలు ద్వారా 75 వేల మందిలో చైతన్యం నింపడం జరిగింది.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై నేరాలు 7.96 శాతం తగ్గాయి.
‘ఇన్ విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్’
డ్రోన్ల సాయంతో ఈవ్ టీజర్ల గుర్తింపు, ఇసుక రీచ్‌ల పర్యవేక్షణ, రహదారులపై ట్రాఫిక్ రద్దీ క్రమబద్దీకరణ, బహిరంగ సమావేశాల్లో ప్రమాదాలు తలెత్తకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది.
రహదారుల భద్రత. ప్రాణం విలువ తెలిసేలా వినూత్నంగా ప్రచారం. దీంతో రహదారులపై ప్రమాదాలు 4.5 శాతం తగ్గాయి.
11.4 లక్షల మంది ఫింగర్ ప్రింట్లు సేకరించడం ద్వారా నేరాల నియంత్రణ. రూ.7.2 కోట్ల విలువైన ఆస్తుల రికవరీ.
ఏఐ టూల్‌ని విస్తృతంగా వినియోగించడం ద్వారా రాష్ట్రంలో స్మార్ట్ పోలీసింగ్.
దేశంలో తొలిసారి పోలీస్ విభాగం కోసం ప్రత్యేకంగా ఏఐ యాప్ అభివృద్ధి.
సీసీ టీవీ నెట్‌వర్క్ మరింత బలోపేతం చేసేలా ప్రణాళికలు సిద్ధం.