- చంద్రబాబు అరెస్టు సమయంలో బైండోవర్ చేశారు
- తన కుటుంబాన్ని వేధించి ఇబ్బందులు పెట్టాడు
- వైసీపీ నేతలపై ఇచ్చిన ఫిర్యాదులపై కేసు పెట్టలేదు
- కోనసిమ జిల్లా ఆదురుకు చెందిన బాధితుడి గోడు
- ప్రజావినతుల కార్యక్రమానికి వెల్లువెత్తిన ఫిర్యాదులు
- భూ కబ్జాలు, మోసాలు, వేధింపులపై అధికంగా అర్జీలు
- వినతులు స్వీకరించిన మంత్రి అనం, ఏపీఎఫ్‌డీసీ చైర్మన్
మంగళగిరి(చైతన్యరథం): టీటీడీ కేంద్ర కార్యాలయంలో శనివారం ప్రజావినతుల కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు తరలి వచ్చారు. బాధితుల నుంచి దేవాదాయశాఖ మంత్రి అనం రామనారాయణరెడ్డి, ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సుజయ్‌కృష్ణ రంగారావు అర్జీలు స్వీకరించారు. ఎక్కువగా భూ కబ్జాలు, మోసాలపైనే బాధితులు న్యాయం చేయాలని కోరుతూ వినతులు అందజేశారు. సమస్యలు విన్న మంత్రి ఆయా శాఖల అధికారుల మాట్లాడి పరిష్కరిం చాలని ఆదేశించారు.
ఎస్‌ఐ అరాచకాలపై విచారణ జరిపించాలి
` గత ఐదేళ్లు వైసీపీ నాయకులు నాపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసులు పెట్టి వేధిం చారని అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం, మామిడికుదురు మండలం ఆదురు గ్రామానికి చెందిన కొల్లు నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశాడు. వైసీపీ నాయకులపై ఇచ్చిన ఫిర్యాదుపై కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదు..చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో తనపై బైండోవర్ బుక్ ఓపెన్ చేసి ఎస్‌ఐ పలుమార్లు మా కుటుం బాన్ని ఇబ్బంది పెట్టారు. విచారణ జరిపించి అలాంటి పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
శివాలయం భూమి కబ్జా చేసిన వైసీపీ సర్పంచ్
` అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం సానిపాయి గ్రామస్తులు సమస్యను వివరి స్తూ 2019లో శివాలయం కోసం సర్వే నెంబర్లు 669/1, 699/2లో ప్రభుత్వం భూమి కేటాయించింది. వైసీపీ సర్పంచ్ నేతి ఆంజనేయులు అధికారులతో కుమ్మక్కై ఆ భూమికి 1978లో పట్టా పొందినట్లు దొంగ పట్టా సృష్టించి భూమిని కబ్జా చేశారు. విచారణ చేసి తిరిగి ఆ భూమిలో దేవాలయం కట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు.
` తన కష్టార్జితంతో కొనుగోలు చేసిన 5 సెంట్ల భూమిని దరువూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి కబ్జా చేసి తనపై దాడికి ప్రయత్నిస్తున్నాడని పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం గ్రామానికి చెందిన పాపగంటి డానియల్‌బాబు ఫిర్యాదు చేశాడు. అతనిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.
పనులు చేయకుండానే రూ.70 లక్షలు దోచుకున్నారు
` పంచాయతీలో ఎటువంటి పనులు చేయకుండా తప్పుడు రికార్డులు సృష్టించి ఆర్థిక సంఘం నిధులు, సాధారణ నిధులను గ్రామ సర్పంచ్..కొంతమంది అధికారులతో కలిసి రూ.70 లక్షల ప్రజాధనాన్ని దారి మళ్లించారు. వారి అవినీతిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం సానిపాయి గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
` కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని వైసీపీ ప్రభుత్వంలో వృద్ధాప్య పింఛన్‌ను అక్ర మంగా ఆపివేశారు..వృద్ధాప్య పింఛన్‌ను తిరిగి పునరుద్ధరించాలని బాపట్ల జిల్లా రేపల్లె పట్టణానికి చెందిన రామచంద్రరావు కోరారు.
శ్మశాన వాటికను ఆక్రమించి దందా
` ఏలూరు జిల్లా భీమడోలు మండలం కురెళ్లగూడెం గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు సమస్యను వివరిస్తూ ఎస్సీ కాలనీ చెందిన శ్మశాన వాటికను పాలకుర్తి చిన్న అనే వ్యక్తి ఆక్రమించారు.. దానివల్ల శ్మశాన వాటిక సరిపోక ఒకరి శవం మీద మరొకరి శవం పాతిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిరది..ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేసి బెదిరిస్తున్నాడు.. సమగ్ర విచారణ జరిపించి ఎస్సీ కాలనీకి శ్మశాన వాటికను కేటాయిం చాలని కోరారు.
` మా గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ గాదె నాగబాబు ఉపాధి హామీ పథకం కింద సుమారు రూ.3 కోట్లు స్వాహా చేసి అక్రమాలకు పాల్పడ్డాడు..అతనిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం చెపుటూరు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు.
పెళ్లి చేసుకుంటానని మోసగించిన కానిస్టేబుల్
` మునీస్ షరీఫ్ అనే ఏఆర్ కానిస్టేబుల్ తనను ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసు కుంటానని నమ్మించి 2018లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు.. ఐదేళ్లుగా అలాగే నమ్మిం చి పెళ్లి చేసుకోకుండా ప్రస్తుతం రూ.50 లక్షలు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని బెది రిస్తున్నాడు.. దయచేసి నాకు న్యాయం చేయాలని బాపట్ల జిల్లా చినగంజాం గ్రామానికి చెందిన సయ్యద్ కరిష్మా ఫిర్యాదు చేసింది.
` గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు దాడి చేసి నాపై కేసులు పెట్టి గురజాల సబ్‌జైలులో 20 రోజుల పాటు వేధించారు..పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గుజ్జ ల పాపిరెడ్డి అనే వ్యక్తి వైసీపీ నేతలతో చేతులు కలిపి కులం పేరుతో దుషించారు.. వారి పై తగిన చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా మండాది గ్రామానికి చెందిన దాసరి అజ య్‌కుమార్ ఫిర్యాదు చేశారు.