విజయవాడ (చైతన్యరథం): కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పరిశీలించారు. తూర్పు నియోజకవర్గ యువనాయకుడు గద్దె క్రాంతి కుమార్, విజయవాడ పార్లమెంటు జనసేన ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసుతో కలిసి నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లను రవినాయుడు పరిశీలించారు. ఆంధ్రా లయోలా కాలేజీ సమీపంలోని 106, 107, 108 పోలింగ్ బూత్ సెంటర్లు, సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలోని 109 పోలింగ్ బూత్ సెంటర్, కోర్టు కాంప్లెక్స్ సమీపంలోని 89, 89ఏ, 91, 92, 93, 110 పోలింగ్ బూత్ సెంటర్లు, కృష్ణలంక హైస్కూల్ దగ్గరున్న 90 నెంబరు పోలింగ్ బూత్ సెంటర్, పటమటలోని రైతుబజార్ దగ్గరున్న 116, 117, 118, 119, 120, 121 నెంబరు పోలింగ్ బూత్ సెంటర్లను నేతలు సందర్శించి పోలింగ్ సరళిపై వివరాలు తెలుసుకున్నారు.