- ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులు
- ప్రజావినతుల కార్యక్రమంలో బాధితురాలి ఫిర్యాదు
- భూ కబ్జాల సమస్యలపైనా క్యూ కట్టిన అర్జీదారులు
- వినతులు స్వీకరించిన మండలి చీఫ్ విప్ అనురాధ,
ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జా బాబూరావు
మంగళగిరి(చైతన్యరథం): గత ఐదేళ్ల పాలనలో వైసీపీ మూకలు చేసిన అరాచకాలు, అక్రమాలు, భూకబ్జాలు నేటికీ ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. టీడీపీ కేంద్ర కార్యా లయంలో ప్రజావినతుల కార్యక్రమానికి బాధితులు క్యూకడుతున్నారు. వివిధ సమస్య లపైనా అర్జీలు అందజేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గురువారం ఎమ్మెల్సీ, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమి టెడ్ చైర్మన్ వజ్జా బాబూరావు వినతులను స్వీకరించారు. అధికారులతో మాట్లాడి వెంటనే అర్జీలను పరిష్కరించేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.
లైంగిక వేధింపులపై వివాహిత ఫిర్యాదు
` సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన శ్రీలక్ష్మి అనే మహిళ తన సమస్యను వివరిస్తూ కుళాయప్ప అనే వ్యక్తి ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో తనపై లైంగికదాడి చేసి ఫొటోలు, వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఎవరికైనా చెబితే చంపేస్తా నని తనలో పాటు తన కూతుర్లను లైంగికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
` నంద్యాల జిల్లా ఫ్యాపిలి మండలం నల్లమేకలపల్లికి చెందిన పి.హరిబాబు చౌదరి సమస్యను విన్నవించుకుంటూ శ్రీకుమార్ అనే వ్యక్తి ఉమ్మడి అనంతపురం డిష్ టీవి డీలర్‌షిప్ కాంట్రాక్ట్ ఇస్తానని రూ.7.5 లక్షలు తీసుకుని కాంట్రాక్ట్ ఇవ్వకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడు. అతనిపై తగిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
భూ కబ్జాపై చర్యలు తీసుకోవాలని వినతి
` జమ్మలమడుగు మండలం మోరంపూడి గ్రామంలో కొనుగోలు చేసిన 12 సెంట్ల భూమిని జంపన చిన్న మద్దిలేటి అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో ఎక్కించుకుని తన భూమిని కబ్జా చేశారని కడప జిల్లా మైలవరం మండలం నార్జంపల్లె గ్రామానికి చెందిన అంబాపురం సుబ్బరాయుడు ఫిర్యాదు చేశారు.
` గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన సౌగంధి అనే మహిళ సమస్యను వివరిస్తూ కాకర్లమూడి దుర్గరావు అనే వ్యక్తి కాలనీలోని వారిని బెదిరిస్తూ ఇబ్బందికి గురిచేస్తున్నాడు. ప్రశ్నించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతానని భయపెడుతున్నాడు. అతనిపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు.
` తన తండ్రి వారసత్వంగా ఇచ్చిన ఆస్తిని నీలి రామకృష్ణయ్య, నీలి శ్రీనివాసులు తప్పుడు పత్రాలు సృష్టించి తన భూమిని కబ్జా చేశారని కడప జిల్లా జమ్మలమడుగు టౌన్‌కు చెందిన నీలి చిన్న వెంకటరమణ ఫిర్యాదు చేసింది. తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ప్రశ్నించినందుకు దాడి చేస్తామని బెదిరిస్తున్నారని..తనకు న్యాయంగా రావాల్సిన భూమిని ఇప్పించి రక్షణ కల్పించాలని కోరారు.