దావోస్ (చైతన్యరథం): ఏపీలో టైర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని టైర్ల తయారీలో అంతర్జాతీయస్థాయి అగ్రగామి సంస్థ అపోలో టైర్స్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ కన్వర్‌ను రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. నీరజ్ కన్వర్‌తో దావోస్ బెల్వేడేర్‌లో భేటీ మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ…. ఆటోమేటివ్ పరిశ్రమలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌లో కొత్త టైర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. టైర్ టెక్నాలజీ ఆవిష్కరణలు, రాష్ట్ర నాలెడ్జి ఎకానమీకి దోహదపడేలా ఏపీలో ఆర్ అండ్ డి కేంద్రాన్ని ఏర్పాటు చేయండి. టైర్ల తయారీ, నిర్వహణలో శ్రామికశక్తిని తయారుచేసేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం స్థానిక విద్యా సంస్థలతో కలసి పనిచేయండి. స్థిరమైన సప్లయ్ చైన్ నిర్థారణ, స్థానిక వ్యవసాయ రంగానికి మద్ధతు ఇవ్వడానికి రబ్బరు తోటలు, ప్రాసెసింగ్ కోసం మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టండి. ఏపీలో పర్యావరణ సుస్థిరత, సమాజాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించినందున కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల్గో పాల్గొనాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. మంత్రి లోకేష్ విజ్ఞప్తిపై అపోలో టైర్స్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్ మాట్లాడుతూ… అపోలో టైర్స్, వ్రేడెస్టెయిన్ బ్రాండ్‌ల క్రింద 100కి పైగా దేశాల్లో అనేక రకాల టైర్ ఉత్పత్తులను తమ సంస్థ మార్కెట్ చేస్తుందని తెలిపారు. 2.3 బిలియన్ అమెరికా డాలర్ల టర్నోవర్‌తో అపోలో టైర్స్ టాప్ 20 గ్లోబల్ టైర్ తయారీదారులలో ఒకటిగా ఉంది. తమ కంపెనీ జర్మనీలోని Reifencom GmbH, నెదర్లాండ్స్‌లోని అపోలో వ్రేడెస్టీన్ దీప BVకొనుగోళ్ల ద్వారా విస్తరించినట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తులపై సహచర ఎగ్జిక్యూటివ్‌లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నీరజ్ కన్వర్ తెలిపారు.