- చదువుకునే పిల్లలను కూడా వదల్లేదు
- అరాచకాలకు జగన్‌రెడ్డి కారణం కాదా?
- డీజీపీ, లా అండ్ ఆర్డర్‌పై వ్యాఖ్యలు విడ్డూరం
- వంశీ అనుచరుల విధ్వంసం అందరూ చూశారు
- పట్టాభిపై జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు
- ప్రెస్‌మీట్ ఫుటేజ్ ఉంటే వాస్తవాలు బయటపెట్టాలి
- మేము దాడి చేశామని విష ప్రచారం చేస్తున్నారు
- ఆధారాలు చూపితే రాజకీయాల నుంచి తప్పుకుంటాం
- గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి
మంగళగిరి(చైతన్యరథం): పన్నెండేళ్లుగా ప్రతిరోజూ వంద మందికి అన్నం పెట్టే సంస్థలో ఉన్న నన్ను ఏ తప్పు చేయకుండా జగన్ ప్రభుత్వం జైలుకు పంపించడం ఆవేదన కలిగించిందని గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి అన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావే శంలో అయన మాట్లాడుతూ గత ఏడాది ఫిబ్రవరి 20న దొంతు చిన్న ఇంటిపై వంశీ అనుచరులు దాడి చేశారు. ఆయనకు అండగా నిలబడి దాడిపై కేసు పెట్టేందుకు నేను గన్నవరం పార్టీ ఆఫీసుకు వెళ్లాను. కంప్లైంట్ రాసి ఇతర నాయకులతో కలిసి స్టేషన్‌కు వెళ్లాం. స్టేషన్‌కు వెళ్లాక మాత్రమే పట్టాభి స్టేషన్‌కు వచ్చారు. మేము కేసు ఫైల్ చేస్తుండగానే 150 మందికి పైగా వంశీ అనుచరులు పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తున్నారని సమాచారం వచ్చింది. దాడి సమాచారం తెలియగానే మేమందరం పార్టీ ఆఫీస్‌కి బయలుదేరాం. రోడ్డు ఎక్కిన వెంటనే వంశీ అనుచరులు కర్రలు కత్తుల తో మాపై దాడికి వచ్చారు. పట్టాభిని బాడీ గార్డులు వెంటనే కారులోకి ఎక్కించి ముం దుకు పోనిచ్చారు. మాపై వంశీ అనుచరులు రాళ్ల దాడి చేశారు. వంశీ అనుచరుల రాళ్ల దాడిలో లక్ష్మి అనే మహిళా కార్యకర్తకు తీవ్రగాయాలయ్యాయి. అక్కడి నుంచి మేము పార్టీ కార్యాలయానికి వెళ్లగా వంశీ అనుచరుల పార్టీ ఆఫీస్ పూర్తిగా ధ్వం సమైంది. కార్లు తగలబెట్టారు. మేమక్కడ ఉండగానే రెండవసారి మాపై రాళ్ల దాడి చేశారు. ఆ దాడిలో సీఐ కూడా గాయప డ్డారు. తనతో పాటు కార్యకర్తలను అరెస్ట్ చేశారని వివరించారు.
ప్రెస్‌మీట్‌లో జగన్‌రెడ్డి అబద్ధాలు
ఈరోజు జగన్ ప్రెస్‌మీట్ చూస్తే చాలా ఆశ్చర్యమనిపించింది. పట్టాభి వందల మందితో ప్రెస్‌మీట్ పెట్టాడని పచ్చి అబద్ధాలు చెప్పారు. నిజంగా జగన్ చెప్పినట్లు పట్టాభి ప్రెస్‌మీట్ పెడితే ఫుటేజీ బయటపెట్టాలని ఛాలెంజ్ చేస్తున్నాం. మా పార్టీ నేతలు దాడి చేసినట్లు ఒక్క ఆధారం చూపించగలిగితే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాము. కల్లు గీత కార్మికుడి కొడుకునైన తాను నీతి నిజాయితీతో ఎన్టీఆర్ దయవల్ల ఎంపీపీ, సర్పంచ్ అయ్యి ఈరోజు ఈ స్థాయికొచ్చాను. పన్నెండేళ్లుగా ప్రతి రోజు వంద మందికి అన్నం పెట్టే సంస్థలో ఉన్న తనను ఏ తప్పు చేయకుండా జైలుకు పంపించడం ఆవేదన కలిగించింది. నాతో పాటు అభంశుభం తెలియని ఉన్నత కుటుంబాలకు చెందిన చదువుకునే పిల్లలను కూడా జైలుకి పంపారు. జైలులో వాళ్లు పడ్డ బాధ చెప్పనలవి కానిది. ఏనాడూ జైలుకెళతామని ఊహించని నన్ను ఒక దుర్మార్గుడు జైలుకి పంపాడు. రాష్ట్రంలో ఇంతటి అరాచకాలు జరగటానికి కారణం నువ్వు కాదా జగన్‌రెడ్డి? అని ప్రశ్నించారు. ప్రజావేదికలో మీటింగ్ పెట్టి ప్రజావేదిక ను కూల్చావు. మీ అరాచకాన్ని ఆదర్శంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మీద దాడి చేశారు. గన్నవరం, గుడివాడ పార్టీ ఆఫీసుల మీద దాడి చేశారు. చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన జోగి రమేష్‌కి మంత్రి పదవి ఇచ్చిన జగన్ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. పల్నాడులో ఎస్సీ, బీసీ, మైనారిటీలను ఇళ్ల నుంచి తరిమారు. జల్లయ్య, తోట చంద్రయ్యని చంపారు. మీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే అతన్ని పక్కన పెట్టుకున్నావు. ఇంత అరాచకం చేసిన జగన్ డీజీపీ గురించి, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. గ్లామర్ లేని భాష మాట్లాడే నీచులు, మానర్స్ లేకుండా మాట్లాడే ఉన్మాదులు, తల్లి..చెల్లి గురించి నీచంగా మాట్లాడే సైకోలకు, విశ్వాస ఘాతుకలకు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన లోకేష్‌తో పోలికా అని దుయ్యబట్టారు. అందమంటే మీ దృష్టిలో గుండాయిజం, రౌడీయిజం, దోపిడీలు చేసేవాళ్లా? అని ప్రశ్నించారు. మీరు చేసిన ఆకృత్యాలను గమనించే ప్రజలు మీకు 11 స్థానాలు కట్టబెట్టారు. ఇంకా బుద్ధి మార్చుకోకపోతే ఈసారి అవి కూడా మిగలవని హితవుపలికారు.