మంగళగిరి(చైతన్యరథం): అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకు డు పర్చూరి మోహన్‌నాయుడుకు మంగళవారం పార్టీ లక్ష ఆర్థిక సాయం అందజేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల నిర్వహించిన ప్రజా వినతుల కార్యక్రమంలో తాను ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని.. దయచేసి సాయం చేసి ఆదుకోవా లని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అర్జీ ఇచ్చి అభ్యర్థించారు. దాంతో స్పందించిన టీడీపీ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య చేతులమీదుగా రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు.