అమరావతి (చైతన్య రథం): ప్రగతిశీల నాయకుడు, ప్రధాని నరేంద్రమోదీతో కలిసి అత్యంత పవిత్రమైన, ప్రతిష్టాత్మకమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకోవడం తన అదృష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. మోదీతో కలిసి మల్లన్నను దర్శించుకున్న అనంతరం ఎక్స్ వేదికగా ఉద్వేగభరిత పోస్టు పెడుతూ.. “శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో ప్రధాని నరేంద్రమోదీతో కలిసి ప్రార్థనలు చేయడం నా అదృష్టం. ఈ పవిత్ర ఆలయం ఎంతో ప్రత్యేకం. దేశంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిసి ఒకే ప్రాంగణంలో ఉండటం. భారతదేశంలోనే ప్రత్యేకతను సంతరించుకుంది. అలాంటి అత్యంత పవిత్ర ఆలయంలో ప్రధాని మోదీతో కలిసి భ్రమరాంబ, మల్లికార్జునులను దర్శించుకోవడం ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు.