- దీపం-2ను సద్వినియోగం చేసుకోవాలి
- మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం పంపిణీ
- రబీలో 10 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
- పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతి(చైతన్యరథం): కోటి మంది లబ్ధిదారులు పైగా వినియోగించుకునేలా రెండో విడత దీపం-2 ఉచిత సిలిండర్ల పంపిణీని మంగళవారం నుంచి ప్రారంభించడం జరిగిందని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సచివాలయం నాల్గో బ్లాక్ ప్రచార విభాగంలో విలేకరులతో ఆయ న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నెరవేర్చిన మొదటి హామీ దీపం-2 అని, గత ఏడా ది అక్టోబరు 31న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చాపురంలో ప్రారంభించడం జరిగింద న్నారు. ఈ పథకాన్ని పెద్దఎత్తున 99.03 లక్షల మంది సద్వినియోగం చేసుకోవడం జరి గిందని, దాదాపు రూ.760 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లోని నేరుగా జమచేయడం జరిగిం దని తెలిపారు. రెండో విడత దీపం-2 పథకాన్ని మంగళవారం నుంచి అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈకేవైసీ నమోదు కార్య క్రమాన్ని నిర్వహిస్తున్నామని, మొత్తం 4,24,59,028 మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు 93 శాతం అంటే 3,85,74,194 మంది ఈకేవైసీ పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశం మేరకు మిగిలిన 3 శాతాన్ని కూడా ఈ నెల కల్లా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజన పథకం కింద నాణ్యమైన సన్న బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపా రు. ఈ ఏడాది జూన్ నుంచి 44,394 ప్రభుత్వ పాఠశాలలకు, 3,938 వసతి గృహాలకు నాణ్యమైన సన్నని బియ్యాన్ని ప్రత్యేక ప్యాకింగ్‌తో నెలనెలా కొరియర్ ద్వారా పంపిణీ చేసే ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకు ప్రత్యేకించి ఐదు గోదాములను కూడా ఏర్పాటు చేస్తు న్నట్లు చెప్పారు. రబీ సీజన్ ప్రారంభం నేపథ్యంలో దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే లక్ష్యాన్ని నిర్థేశించుకోవడం జరిగిందని చెప్పారు. కేం ద్రం అంచనాల మేరకు రాష్ట్రంలో ఈ రబీలో దాదాపు 13.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్రంలో పండిరచడం జరుగుతుందని, అందులో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధం అవుతున్నామని వివరించారు.
ఇందు కోసం 2,900 రైతు సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా కేంద్రాల్లో దాదాపు 12 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఖరీఫ్‌లో 35,93,443 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.8,279 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందన్నారు. జీపీఎస్ విధానాన్ని తీసుకురావడం జరిగిం దని, గోతాలకు కూడా ఎటువంటి కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవడం జరిగింద న్నారు. ఇదే ఖరీఫ్ సీజన్‌లో గత ప్రభుత్వ హయాంలో కేవలం 29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసి రూ.6,500 కోట్లను చెల్లించడం జరిగిందన్నారు. మొత్తం మీద గతంతో పోల్చుకుంటే తమ ప్రభుత్వం 20 శాతం ఎక్కువగా ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 4.95 లక్షల మంది రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తే తమ ప్రభుత్వం నేటికీ 5.60 లక్షల రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్‌కార్డుల స్థానంలో రైస్ కార్డులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తో త్వరలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. క్యూఆర్ కోడిరగ్ కూడా ఈ రైస్ కార్డులకు ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగువతి నిబంధనలను సరళీకృతం చేయడం వల్ల తెలంగాణా ప్రభుత్వం కాకినాడ పోర్టు నుంచి దాదాపు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయడం జరుగుతుందని తెలిపారు.