- పశువుల పాకలో విద్యార్థులకు తరగతులు
- ప్రజావినతుల కార్యక్రమంలో ఫిర్యాదు
- అర్జీలు స్వీకరించిన మంత్రి కొలుసు పార్థసారథి
మంగళగిరి(చైతన్యరథం): గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని స్వర్ణాంధ్ర నగర్ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని వైసీపీ కార్యకర్త చింతా శ్రీదేవి ఆక్రమించుకుందని కర్రి యోహాను సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల కార్యక్రమం లో ఫిర్యాదు చేశారు. దాంతో పాఠశాలను పక్కన ఉన్న పశువుల పాకలో నిర్వహిస్తు న్నారని చెప్పారు. దీనిపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని..ఈ ఆక్రమణపై చర్యలు తీసుకుని విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. మంత్రి కొలుసు పార్థసారథి, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ అర్జీలు స్వీకరించారు.
` తమపై దాడి చేసిన వారి మీద కేసు పెడితే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని కృష్ణా జిల్లా గన్నవరం మండలం దావాజీగూడెంకు చెందిన మొగల్ షాజా ఫిర్యాదు చేశాడు. చర్చల పేరుతో తమను మరోసారి పిలిచి కాళ్లు, చేతులు విరిగేలా తమను ప్రత్యర్థులు తీవ్రంగా కొట్టారని వాపోయాడు. దీనిపై వెంటనే ఉన్న తాధికారులు చర్యలు తీసుకోవాలని అర్జీ ఇచ్చారు.
` తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని అదనపు కట్నం కోసం తనను చిత్రహింసలు పెడుతున్నాడని నంద్యాల జిల్లా అవుకు మండలానికి చెందిన 19 ఏళ్ల వివాహిత గోడు వెళ్లబోసుకుంది. లెదర్ బెల్టుతో తనను వాతలు పడేలా కొట్టాడని.. భర్త దోమ పుల్లారెడ్డి, అతని కుటుంబం వల్ల తనకు ప్రాణహాని ఉందని కన్నీళ్లు పెట్టుకుంది.
` తన భర్త చనిపోగా వైసీపీ నాయకుల అండతో కొంతమంది ఆయన సంతకా లను ఫోర్జరీ చేసి తమ స్థలాన్ని ఆక్రమించుకున్నారని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం కు చెందిన డి.భారతి తెలిపారు. విచారించి తమ స్థలం కబ్జా నుంచి విడిపించి తనకు న్యాయం చేయాలని అర్జీ ఇచ్చారు.
` తన తండ్రి నుంచి తనకు వాటాగా రావాల్సిన భాగాన్ని తన అన్న శ్రీనివాస రావు తన కుమార్తెల పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని పల్నాడు జిల్లా దుర్గి గ్రామానికి చెందిన వారణాసి గోవిందయ్య ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి తనకు రావాల్సిన భాగాన్ని తనకు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశాడు.
` అద్దంకిలో భూమిని కొనుగోలు చేయగా ఆ భూమిని అమ్మిన వ్యక్తి కుమారుడు కొంత ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నాడని పావులూరి విజయలక్ష్మి విన్నవించు కున్నారు. తాము కొనుగోలు చేసిన భూమిని సర్వే చేసి హద్దులు చూపాలని అధికా రులకు ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా సర్వేయర్ వచ్చి భూమిని కొలవడం లేదని ఫిర్యాదు చేశారు. భూమిని కొలిచి హద్దులు ఏర్పాటు చేసి తమ భూమి కబ్జా కాకుం డా చూడాలని వినతిపత్రం అందజేశారు.
` తమ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లి మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన వేమూరి సుబ్బారావు తెలిపారు. గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశాడు.
` తమ భూమి వాస్తవంగా ఉండాల్సింది 3.39 సెంట్లు అయితే గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో 3.10 సెంట్లుగా తగ్గించి నమోదు చేశారని దీనిపై మళ్లీ సర్వే చేసి తమకు భూమి తమకు ఎక్కించి న్యాయం చేయాలని పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం కంభంపాడు గ్రామానికి చెందిన బోడపాటి చంద్రమౌళి విజ్ఞప్తి చేశారు.
` గత 20 ఏళ్ల నుంచి స్వీపర్లుగా పనిచేస్తున్న తమకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని అనకాపల్లి జిల్లా రూరల్ మండల పోలీసుస్టేషన్లలో పనిచేస్తున్న స్వీపర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చే నాలుగు వేలలో మళ్లీ రూ.500 తగ్గించి ఇస్తు న్నారని.. దయచేసి జీతం పెంచాలని అభ్యర్థించారు.
` తన తండ్రికి ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాన్ని కంచాల శ్రీను ఆక్రమించుకుని తమను ఇబ్బంది పెడుతున్నాడని కందుకూరుకు చెందిన మణికు మార్ ఫిర్యాదు చేశాడు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకో లేదని.. ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని కబ్జా నుంచి విడిపించాలని విజ్ఞప్తి చేశారు.
` తమ స్వాధీనంలో ఉన్న భూమి కొంతకాలంగా బీడు భూమి కాగా కబ్జాదారు లు అక్రమ పట్టాదారు పాసుపుస్తకాలు పుట్టించుకుని రికార్డుల్లో పేర్లు మార్చారని ఏలూరు జిల్లా దెందులూరు మండలం పెరుగుగూడెంకు చెందిన గారపాటిÄ గాంధీ తదితరులు ఫిర్యాదు చేశారు. విచారించి తమకు న్యాయం చేయాలని కోరారు.