అమరావతి (చైతన్యరథం): ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారయింది. మే 2న మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుండి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3.30కి అమరావతిలోని హెలిప్యాడ్‌కు చేరతారు. హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకు 1.2 కిలోమీటర్లు.. 15 నిమిషాల పాటు రోడ్డు షో ఉంటుంది. మధ్యాహ్నం 3.45కు అమరావతి పెవిలియన్‌ను మోదీ సందర్శిస్తారు. రూ.లక్ష కోట్ల అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించి, అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. సాయంత్రం 5.20కి తిరిగి ఢల్లీికి బయల్దేరతారు.