- ఆయన ప్రలోభాలతోనే నకిలీ మద్యం
- జగన్ పాలనలో వేల ప్రాణాలు తీశారు
- రెవన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి(చైతన్యరథం): వైసీపీ నేత జోగి రమేష్ పాపం పండిరదని రెవన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. విష పూరిత నకిలీ మద్యంతో జగన్ పాలనలో వేలాది మంది ప్రాణాలు పోయి.. వారి భార్యల మాంగల్యాలు మంటగలిశాయి. లక్షలాది మంది ఆరోగ్యాలు గుల్ల అయ్యాయి. జగన్ ‘జే’ బ్రాండ్ మద్యం ప్రభుత్వ షాపుల్లో అమ్మాడు. జోగి రమేష్ నకిలీ మద్యం తయారు చేయించి బెల్టు షాపులు, ప్రభుత్వ షాపుల్లో అమ్మించాడు. అగ్రీగోల్డ్ భూములు కబ్జా చేశారు. నకిలీ మద్యం సూత్రధారి జోగి రమేష్.. పాత్రధారి అద్దేపల్లి జనార్దన్‌రావు ముఠా. ఆయన ఆఫ్రికాకు జంప్ అయ్యే ముందు జోగి రమేష్ ఇంటికి ఎందుకు వెళ్లాడు? జోగి రమేష్ ఇంటికి అద్దేపల్లి వెళ్లినట్టు సీసీ టీవీ పుటేజ్ రుజువు నిజనిర్ధారణకు బలమైన ఆధారం కాదా? న్యాయస్థానాల్లో సీసీ టీవీ పుటేజ్‌కు విలువ ఉంటుంది గాని జోగి రమేష్ ప్రమాణా లు, ఒట్టుకు, సవాళ్లకు విలువ ఉండదనేది జగమెరిగిన సత్యం.
మాజీ మంత్రికి ఈ కనీస జ్ఞానం కూడా లేదా? లేక ప్రజల్ని వెర్రివాళ్లు అని జగన్ ముఠా భావిస్తోందా? జోగి రమేష్ ప్రలోభా లతోనే 2022 నుంచి నకిలీ మద్యం తయారీని ప్రారంభించానని అద్దేపల్లి వాంగ్మూలం ఇచ్చింది నిజం కాదా? అతనికి రూ.3 కోట్లు ఆశ పెట్టింది నిజం కాదా? బాల్యం నుంచి ఇద్దరు స్నేహితులనేది నిజం కాదా? ఇలాంటి నిజాలు ఎన్నో ఉన్నా ఇతన్ని జగన్ ఎందు కు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. తోడు దొంగలు కాబట్టే కదా? జయచంద్రారెడ్డిని తెలుగుదేశం నుంచి సస్పెండ్ చేసి చంద్రబాబు ప్రభుత్వం కేసు నమోదు చేసింది. టీడీపీ నకిలీ మద్యానికి ఆస్కారం ఇవ్వదు. అందుకే సస్పెండ్ చేసి తన నిజా యితీని రుజువు చేసుకుంది. జోగి రమేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా ఎదురుదాడి ఎందుకు చేస్తున్నారు? నేరస్తులపై చర్య తీసుకోవడం కక్ష సాధింపు ఎలా అవుతుంది? కక్ష సాధింపు అని జగన్ ముఠా చేసే కాకి గోలను నమ్మే అమాయకులు కాదు రాష్ట్ర ప్రజలు. నేరస్థులకు కులాలు ఉండవు. వీరు కుల ద్రోహులు కూడా అవుతారు. వేలాది పేదల ప్రాణాలు తీసిన నకిలీ మద్యం దారులను అరెస్టు చేసిన సిట్ అధికారులను ప్రజలు అభినంది స్తున్నారని పేర్కొన్నారు.














