అమరావతి (చైతన్యరథం): కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతుల కుటుంబాలు సంక్రాంతి సందడితో కళకళలాడుతున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల తెలిపారు. ఆదివారం నాటికి 27లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని చెప్పారు. ధాన్యం సేకరణపై మంత్రి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. 4,15,066 మంది రైతుల నుంచి ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరించాం. వైసీపీ హయాంలో కేవలం 2 లక్షల మంది రైతుల నుంచే ధాన్యం కొన్నారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నాం. రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.6,083.69 కోట్లు జమ చేశాం. వైసీపీ హయాంలో ధాన్యం డబ్బులు కూడా సక్రమంగా ఇవ్వలేదు. కొనుగోలు చేసిన వెంటనే నగదు జమచేసి రైతుల కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం సంక్రాంతి సందడి తెచ్చిందని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.