- యువనేత లోకేష్ చేతులమీదుగా శ్రీకారం
- ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తాం
- మూడేళ్లో పోయేవి తప్ప కొత్తగా వచ్చినవి లేవు
- పెట్టుబడులు పెట్టాలంటే సిఎంఓకు ముడుపు చెల్లించుకోవాల్సిందే
మంగళగిరి: మంగళగిరి పట్టణంలోని టిప్పర్ల బజార్ లో సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించారు. నియోజకవర్గంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు సంజీవని ఆరోగ్య కేంద్రం ప్రారంభమైంది. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రుల చుట్టూ తిరగలేని.. డబ్బు ఖర్చు చేయలేని నిరుపేదలు, మధ్య తరగతి ప్రజల కోసం సంజీవని ఆరోగ్య కేంద్రాన్ని లోకేష్ సొంత నిధులతో సమకూర్చారు. ఈ ఆరోగ్య కేంద్రంలో అత్యాధునిక చికిత్స పరికరాలు, పరీక్ష యంత్రాలు, ఎమర్జెన్సీకి అవసరమైన సామగ్రిని ఏర్పాటుచేశారు. ఒక అయిన డాక్టర్, క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్, ఫిమేల్ నర్స్, కాంపౌండర్ ఇందులో ఉంటారు. ఆరోగ్య కేంద్రంలోనే 200కి పైగా రోగనిర్దారణ పరీక్షలు కూడా పూర్తిగా ఉచితంగా చేస్తారు. అవసరమైనవారికి మందులు కూడా ఉచితంగా అందజేస్తారు. అందరికీ ఆరోగ్యమస్తు- ప్రతీ ఇంటికీ శుభమస్తు అనే నినాదంతో ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. 10వ తరగతి, పాస్ డిగ్రీ ఫెయిల్ అయిన తెలివితేటలు జగన్మోహన్ రెడ్డివని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి టైం అయిపోయింది… ఇంటికెళ్లే సమయం దగ్గర పడిరదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం నుండి వెళ్లిపోయిన పరిశ్రమలు తప్ప కొత్తగా వచ్చిన పరిశ్రమలు ఏమి లేవని చెప్పారు. పెట్టుబడులు పెట్టాలంటే సీఎంవోలో వాటా ఎంత ఇవ్వాలి అనే చర్చే జరుగుతోందన్నారు. గత 3ఏళ్లలో రాష్ట్రానికి తెచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేస్తే చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేస్తున్న ప్రతీ పరిశ్రమా తెలుగుదేశం ప్రభుత్వ కృషేనని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని జగన్ ప్రభుత్వమే ఒప్పుకుంది.. దాదాపు 500 హామీలు ఇచ్చి మాట తప్పి మడమ తిప్పిన జగన్మోహన్ రెడ్డిని 175 నియోజకవర్గాలు గెలిపించాలా? అని ఎద్దేవా చేశారు. ఈడీ, ఐటి, సీబీఐ భయంతో ఢల్లీిలో మెడలు వంచుతున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం సాధించారని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓ పెద్ద కుంభకోణం వచ్చేవారం బయటపెట్టబోతున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాం… మంగళగిరిలో విజయవంతం అయిన కార్యక్రమాలు అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని లోకేష్ పేర్కొన్నారు.