- చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత
- 17 వేల మందికి చెల్లింపులు
- ఆర్థికమంత్రి పయ్యావుల వెల్లడి
అమరావతి (చైతన్యరథం): దీర్ఘ కాలంగా పెండిరగ్‌లో ఉన్న వివిధ బిల్లులకు మోక్షం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బిల్లుల చెల్లింపుల్లో చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు. బిల్లుల చెల్లింపులపై కసరత్తు చేశారు. సుమారు 17 వేల మందికి రూ.2 వేల కోట్ల మేర చెల్లింపులు చేయనున్నారు. నీరు-చెట్టు, గుంతల రహిత రోడ్లు, నాబార్డు పనులకు బిల్లుల చెల్లింపులు చేయనున్నట్లు మంత్రి పయ్యావుల వెల్లడిరచారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ బిల్లులతో పాటు పోలవరం ప్రాజెక్టుకూ కొంత మొత్తం విడుదల చేయనున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను గట్టెక్కించాలన్న సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో పని చేస్తున్నామని చెప్పారు. ఎన్ని ఇబ్బందులున్నా పెండిరగ్ బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు బిల్లుల చెల్లింపులు దోహదం చేస్తాయన్నారు. గత మూడు నాలుగేళ్లుగా పెండిరగ్‌లో ఉన్న బిల్లులను కూడా చెల్లిస్తున్నట్లు చెప్పారు.
9 వేల మంది చిన్న కాంట్రాక్టర్లు, 8 వేల మంది నీరు-చెట్టు లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు చేస్తున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. దీర్ఘ కాలంగా పెండిరగులో ఉన్న వివిధ బిల్లుల చెల్లింపులు చేస్తున్నామని అన్నారు. సాధ్యమైనంత మేరకు ఫిఫో (ముందు వచ్చిన వారికి ముందు) పద్ధతిని పాటిస్తూ చెల్లింపులు జరపాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మొత్తం విడుదల చేస్తున్న బిల్లుల్లో రూ. 2000 కోట్లలో 90 శాతం చిన్న కాంట్రాక్టర్లకు.. కేవలం 10 శాతం మాత్రమే పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరపనున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రూ. కోటి లోపు ఉన్న బిల్లులే ప్రాధాన్యంగా చెల్లింపుల ప్రక్రియ జరుగుతోందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.