- ఫలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు
- వైసీపీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా నిలిపేసిన బిల్లుల చెల్లింపులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- గత ప్రభుత్వం క్లోజ్ చేసిన 3,52,788 పనులకు బిల్లులు ఇచ్చేందుకు అంగీకారం
- రూ.180 కోట్ల చెల్లింపులకు మార్గం సుగమం
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ విధ్వంసం చేసిన గత పాలకులు… ఉపాధి హామీ పనుల విషయంలోనూ అంతే విధ్వంసకర రీతిలోనే వ్యవహరించారు. 2014-2019 మధ్య కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా అమలు చేసి పేదలకు ఉపాధి కల్పించింది. అయితే 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పాడ్డాక సుమారు రూ.300 కోట్లకు పైగా విలువైన 4,22,633 ఉపాధి హమీ పనులకు చెల్లింపులు నిలిపివేసింది. దీంతో ఐదేళ్లపాటు ఆ పనులకు సంబంధించిన సమాచారం లేకపోవడంతో.. 4.22 లక్షల పనులకు సంబంధించిన ఫైళ్లను కేంద్రం మూసేసింది. అయితే 2024 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పెండిరగ్ బిల్లులను ఒక్కొక్కటిగా చెల్లిస్తూ.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వ్యవస్థలను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో పెండిరగులో ఉన్న రూ. 100 కోట్ల నరేగా బిల్లులను ఇప్పటి వరకు చెల్లించింది. మిగతా పనులకు స్టేటస్ క్లోజ్ అని పెట్టడంతో డబ్బులు చెల్లించలేకపోయారు. ఇదే సందర్భంలో 2014-19 మధ్య కాలంలో చేపట్టిన 4.22 లక్షల పనులకు సంబంధించి బిల్లులు పెండిరగులో ఉండిపోవడంపై దృష్టి సారించింది.
ఏడాది కష్టం..
కేంద్రంతో సంప్రదింపులు జరిపిన మీదట.. ఆ పనులకు సంబంధించిన బిల్లులను.. సదురు పనులకు సంబంధించిన ఫైళ్లను మూసేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. మూసేసిన ఆ బిల్లులను రీ-ఓపెన్ చేసి చెల్లించాలని ఏడాది కాలంగా కేంద్ర ప్రభుత్వంతోనూ, ఉపాధి హామీ పథకానికి చెందిన కేంద్రంలోని ఉన్నతాధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతోంది. కూటమి ప్రభుత్వ ఏడాదిగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయి. సుమారు రూ. 180 కోట్ల విలువైన పనుల బిల్లులను మళ్లీ రీ ఓపెన్ చేశారు. దీంతో 3,52,788 ఉపాధి హామీ పనులను రీసార్ట్ చేస్తూ.. ఆ పనులకు సంబంధించి సుమారు రూ. 180 కోట్ల విలువైన పనులకు బిల్లులు చెల్లించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ ప్రాసెస్‌ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసిన తరువాత దీనికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు విడుదల అవ్వనున్నాయి. దీంతో ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేర్చినట్లవుతుంది.