అమరావతి (చైతన్య రథం): తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శాసనసభలో వైసీపీ సభ్యులు పంపిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ… తల్లికి వందనం పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ త్వరలో ఇస్తాం. బడ్జెట్‌లో రూ.9407 కోట్లు ఈ పథకానికి కేటాయించాం. గత ప్రభుత్వంలో వారు ఏడాదికి రూ.5,540 కోట్లు కేటాయించారు, గతంతో పోలిస్తే ఇది 50శాతం అధికం. ఎన్నికలకు ముందుకు బాబు సూపర్ `6 అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తల్లికి వందనం పథకాన్ని ఆనాడు చంద్రబాబు ప్రకటించారు. భారతదేశంలో రీప్లేస్‌మెంట్ రేట్‌లో తమిళనాడు తర్వాత స్థానంలో ఏపీలో ఉంది. మే నెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంతమంది చదువుకునే బిడ్డలుంటే అంతమందికీ పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.