అమరావతి (చైతన్య రథం): దేశానికి రక్షక దళంగా జాతీయ రక్షక దళం ప్రదర్శించే నిస్వార్ధ నిబద్ధతకు వందనం చేస్తున్నా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ 41వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. “ఎన్ఎస్ లోని అన్ని దళాలల సిబ్బందికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ప్రపంచస్థాయి, దోషరహిత దళం, ఎన్ఎస్ నిజంగా సర్వత్ర సర్వోత్తమం, సురక్ష సూత్రాలను కలిగివున్న దళం. మన దేశాన్ని కాపాడుకోవడంలో మీ ధైర్యం, క్రమశిక్షణ, నిస్వార్థ నిబద్ధతకు నేను వందనం చేస్తున్నా’ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.