- జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసింది జగనే
- పట్టిసీమ ఒట్టిసీమ కాదు.. పంట దిగుబడులు పెంచిన భాగ్యసీమ
- 420 కాదు.. విజన్ 2020 నిజమై 30 లక్షల మందికి ఉపాధి కల్పించిన కల్పతరువైంది
- ప్రభుత్వ ఆస్తులు కుదవబెట్టింది జగన్.. పోర్టులు అమ్మేసింది జగన్
- చెత్తపన్ను వేసింది జగన్.. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలు తీసింది జగన్
- జగన్ అవలక్షణాలు చంద్రబాబుకు అంటకట్టి రాసిన అబద్ధమే వందసార్లు రాస్తున్న వర్ధెల్లి మురళి
‘చేతలు గడప దాటకుండానే మాటలు కోటలు దాటించే కోతలరాయుళ్లు’.. అంటూ వర్థెల్లి మురళి సాక్షిలో జగన్ అవలక్షణాన్ని చంద్రబాబుకు అంటకట్టే కుతంత్రపు రాత రాశారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేశారు. ఇసుక మాఫియాకు అన్నమయ్య డ్యాంను గల్లంతు చేశారు. రాయలసీమ లిఫ్ట్ పేరుతో జలజగడం సృష్టించి కృష్ణా, తుంగభద్ర, గోదావరి నదులపై రాష్ట్ర హక్కుల్ని కేంద్రానికి ధారాదత్తం చేశారు. రివర్స్ టెండర్ పేరుతో పోలవరం నిర్మాణాన్ని 15 నెలలు ఆలస్యం చేయడం వల్ల వరదలకు డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది… 2021కి పోలవరం పూర్తి చేస్తానన్న జగన్ మాటలు కోటలు దాటాయి కానీ, ఆచరణ గడప దాటలేదు.
పట్టిసీమను ఒట్టిసీమ అని జగన్ ముఠా ఎగతాళి చేసింది. రికార్డు సమయంలో పట్టిసీమను చంద్రబాబు పూర్తి చేయడం వల్ల రూ.50 వేల కోట్ల విలువైన పంట దిగుబడులు వచ్చాయి. రాయలసీమకు పట్టిసీమ వల్ల నీటిలభ్యత పెరిగింది.
విజన్ 2020ని 420 అని జగన్ తండ్రి ముఠా నిందా ప్రచారం చేసింది. విజన్ 2020 నేడు నిజమై సైబరాబాద్..ఉమ్మడి రాష్ట్రంలోని 294 నియోజకవర్గాలలోని రైతుల బిడ్డలకు, కూలీల బిడ్డలకు 30 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించింది.
తెలుగుగంగపై దుష్ప్రచారం చేశారు. ఎన్‌టీఆర్‌పై దాడికి ప్రయత్నించారు. నేడు తెలుగుగంగే రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు వరప్రసాదమై నిలిచి ఉన్నది. రేపు పోలవరం..నదుల అనుసంధానం నిజం కాబోతున్నది. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌లో పేర్కొన్న నదుల అనుసంధానంలో భాగంగా జలహారతి కూడా నిజమై కృష్ణా, గోదావరి జలాలు రాష్ట్రమంతటా గలగలా పారి కరువు రహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. భవిష్యత్తును చూడలేని కబోధులు విజన్‌ను ఎగతాళి చేసి శునకానందం పొందుతారు. లేదా విధ్వంస రచన చేస్తారు.
జగన్ రూపకల్పన చేసిన గోదావరి..బనకచర్ల ప్రాజెక్ట్‌ను చంద్రబాబు కాపీ కొట్టారని మరో అబద్ధం సాక్షిలో రాశారు. గోదావరి..బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ అనుసంధానం కోసం చంద్రబాబు 2019లోనే వైకుంఠపురం దగ్గర శంకుస్థాపన చేసిన దృశ్యాన్ని రాష్ట్రమంతా చూసింది. ఈ చంద్రబాబు స్కీంను కాపీ కొట్టింది జగనే. కాపీ కొట్టే అలవాటు జగన్‌ది కాగా, చంద్రబాబు సృష్టికర్తగా రుజువై ఉన్నారు.
పోలవరం 41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే.. కుడి కాల్వ ఆయకట్టుకే సరిపోని నీటిని బనకచర్లకు తరలించడం ఎలా సాధ్యమంటూ వర్ధెల్లి మురళి మరో కుతర్కం లేవదీశారు. 41.15కు పరిమితం చేసే ఆలోచన జగన్‌దేగాని చంద్రబాబుది కాదు. చంద్రబాబు 2014`19లో పోలవరం ఎత్తు 45.72 మీటర్లకు రూ.55వేల కోట్ల అంచనాతో కేంద్ర ప్రభుత్వ టెక్నికల్ అడ్వయిజరీ కౌన్సిల్ ఆమోదం సాధించారు. నేడుకూడా 45.72 మీటర్లమేర నిర్మించడమే కూటమి ప్రభుత్వ కృతనిశ్చయమని స్పష్టం చేయడమైంది. `అయినా మురళి అలవాటుగా 41.15 మీటర్లేనని అబద్ధాలు రాశారు. మురళి తెలంగాణవాసి కనుక పోలవరం ఎత్తు 45.72 మీటర్లు ఉండకూడదని కోరుకుంటున్నట్టు ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ఎత్తు 45.72 మీటర్లు నిర్మించి నదుల అనుసంధానం చేస్తుంది. గోదావరి జలాలు బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తరలించి దానినుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు అనుసంధానిస్తుంది. పెన్నానదికి తరలిస్తుంది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేస్తుంది. పురుషోత్తమపట్నం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి ఉత్తరాంధ్రనూ సస్యశ్యామలం చేస్తుంది.
రోడ్ల నిర్మాణాన్ని ప్రయివేట్‌వారికి అప్పజెప్పిన విధంగానే ఈ ప్రాజెక్టును కూడా ప్రయివేటువారికి పదేళ్లపాటు రుసుము వసూలుకు ఇస్తారనే విధంగా రాశారు. గతంలో జాతీయ రహదారుల నిర్మాణంలో కూడా ఇలాగే ప్రజలను రెచ్చగొట్టారు. ఈ రోజు జాతీయ రహదారుల్లో ట్రాక్టర్లు, ఆటోలు, టూ వీలర్లకు టోల్ వసూలు చేయడం లేదు. కార్లు, భారీ వాహనదారులు కూడా ఈ రహదారులపై చక్కగా ప్రయాణం చేయగలుగుతున్నారు. సమయం ఆదా అవుతున్నది. కదుపులు లేవు. వాహనాల రిపేర్ల ఖర్చు, డీజిల్, పెట్రోల్ ఖర్చు ఆదా అవుతున్నది. ప్రతి నూతన స్కీముపై రాజకీయ స్వార్థం కోసం అబద్ధాలు చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టడం పని పెట్టుకున్నది అవినీతి సాక్షి మీడియా.
పీ4 విధానం ద్వారా పేదరిక నిర్మూలన సంకల్పంపై కూడా విషపురాతలు రాశారు. చంద్రబాబు డ్వాక్రా వ్యవస్థను పెంచిపోషించి కోటిమంది మహిళల్ని పేదరికం నుంచి విముక్తి చేశారు. విజన్ 2020 ద్వారా సైబరాబాద్ సృష్టించి 30 లక్షలమంది పేదల బిడ్డల్ని పెద్ద జీతాలు పొందేవారిగా అభివృద్ధి చేశారు. కూలీల బిడ్డలు కూడా ఈరోజు వివిధ దేశాలలో పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారంటే అది చంద్రబాబు కృషి మూలంగానే. అమరావతిలో ఎస్సీ, బీసీ, ఎస్టీలు పెద్దఎత్తున లబ్దిపొందారు. పీ4 విధానం ద్వారా 2047నాటికి పేదరిక నిర్మూలన జరుగుతుంది. జగన్ పాలనలో మద్యంరేట్లు పెంచి పేదల బిడ్డలు తినాల్సిన వారి తండ్రి సంపాదనను రూ.2 లక్షల కోట్లు జగన్ ప్రభుత్వం కొల్లగొట్టింది. నాసిరకం మద్యం వల్ల 35 లక్షలమంది పేదలు ఆరోగ్యం చెడి, వారి సంపాదన చెడి, పేదలు నిరుపేదలయ్యారు. లక్షలాది ఎకరాలు పేదల అసైన్‌మెంట్ భూములు కబ్జా చేశారు. లాండ్, శాండ్, వైన్, మైన్, రేషన్ బియ్యం, గంజాయి మాఫియా ద్వారా పేదల సంపాదన కొల్లగొట్టింది జగన్ ముఠానే!
గురజాల మాల్యాద్రి, ఛైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్