- దేశాభివృద్ధిలో యువతదే కీలక పాత్ర
- బాబా విశిష్టమైన విద్యా విధానానికి విద్యార్థులే ప్రతిరూపాలు
- వసుధైక కుటుంబం అనేది శాశ్వత సిద్ధాంతం
- శ్రీసత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ స్నాతకోత్సవంలో సీఎం చంద్రబాబు
పుట్టపర్తి (చైతన్యరథం): శ్రీసత్యసాయి సిద్ధాంతాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు ఇచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శనివారం శ్రీసత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (ఎస్ఎస్ఎస్ఐహెచ్ఎల్) 44వ స్నాతకోత్సవం జరిగింది. ఈ స్నాతకోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… విలువల ఆధారిత, వ్యక్తిత్వ నిర్మాణమే కేంద్రంగా ఉన్న ఎస్ఎస్ఎస్ఐహెచ్ఎల్ స్నాతకోత్సవానికి హాజరైనందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు. పట్టభద్రులైన గ్రాడ్యుయేట్లందరికీ అభినందనలు. భగవాన్ సత్యసాయి బాబా విశిష్టమైన విద్యా విధానానికి విద్యార్థులే ప్రతిరూపాలు. సత్యసాయి ఒక ఉద్దేశ్యంతో ఈ లోకానికి వచ్చారు. ఒక ఉద్దేశ్యం కోసమే జీవించారు. మన కోసం ‘సాయి సిద్ధాంతాన్ని’ ఇచ్చి వెళ్లారు. సత్యసాయి బాబా విద్యా విధానం ప్రకారం ఫస్ట్, సెకండ్, థర్డ్ లాంగ్వేజీలన్నీ సేవే. ఇప్పుడు పట్టభద్రులు అయిన వారంతా నిస్వార్ధ సేవ, కరుణ, నిజాయితీ అనే విలువలను నిబద్ధతతో ఆచరించాలి. భారతదేశం వేల -సంవత్సరాలుగా తన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచంతో -పంచుకుంటోంది.
“వసుధైక కుటుంబం” అంటే “ప్రపంచమంతా ఒకే కుటుంబం” అనేది శాశ్వత సందేశం. ఇది మన సంస్కృతికి గుండెకాయ వంటిది. శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ -సంస్థ విద్యాభ్యాసంతో పాటు నీతి, విలువలను కూడా -మిళితం చేస్తుంది. సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్స్ వంటి -రంగాల్లో నైపుణ్యంతో పాటు, సామాజికంగా ఉపయోగపడే పరిశోధనలకు ఇక్కడ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. శ్రీసత్యసాయి ఇనిస్టిట్యూట్ -ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ సంస్థ యువ మేధావులను -తీర్చిదిద్దింది. 21వ శతాబ్దం భారతదేశానిది. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. 1990ల మధ్యలో సాంకేతిక పురోగతి అనేది ప్రారంభమైంది. ఇది హైదరాబాద్ సహా అనేక నగరాలను ప్రపంచ ఐటీ హబ్లుగా మార్చింది. భారతదేశానికి అధిక జనాభా వల్ల ప్రయోజనాలు కలుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూపంలో మనకు బలమైన నాయకత్వం ఉంది.
ఈ అనుకూలతలన్నీ సద్వినియోగం చేసుకోవడం ద్వారా -దేశం 10వ స్థానం నుంచి 4వ అతిపెద్ద ఆర్థిక -వ్యవస్థగా ఎదిగింది. 2047 నాటికి మనం ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా అవతరిస్తాం. దీనిని సాధించడానికి మనం భవిష్యత్తు రంగాలు అయిన ఏఐ-డేటా సెంటర్లు, క్వాంటం ఏరోస్పేస్, డ్రోన్, అంతరిక్షం, సెమీకండక్టర్, ఆరక్షణ రంగాలల్లో పెట్టుబడులపై దృష్టి సారిస్తున్నాం. దేశంలో ఉన్న అన్ని ఫ్యూచర్ టెక్నాలజీలను ఏపీకి తెస్తున్నాం. సీఐఐ -సదస్సులో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం… వీటిద్వారా 16 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. విశాఖలో డేటా సెంటర్ కోసం 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులను గూగుల్ పెట్టనుంది. వినూత్న ఆలోచనలకు ఆర్టీఐహెచ్ వేదిక. కొత్త ఆలోచనలతో వచ్చిన వారితో కంపెనీలు పెట్టించేలా చూస్తున్నాం. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైన్యూర్, వన్ ఫ్యామ్లీ-వన్ ఏఐ టెక్నీషియన్ అనే సిద్ధాంతంతో పని చేస్తున్నాం. భారత దేశంలో తెలుగు వాళ్లు నెంబర్-1గా ఉండేలా పని చేస్తున్నాం. నైపుణ్యమున్న యువతదే అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర. విద్యార్థులు, యువతే దేశానికి సంరక్షకులు. సాయి సిద్ధాంతం *అమలు చేస్తూనే, సాంకేతికత, ఆవిష్కరణలను ఉపయోగించడం ద్వారా సంక్షేమానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయండి.
బాబా ప్రపంచంలోని నలుమూలలా -ఉన్న కోట్ల మందిని ప్రభావితం చేయగలిగారు. “సాయి సిద్ధాంతాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలి. సాయిబాబా స్పూర్తితో వెల్తీ, హెల్తీ, హ్యపీ #సొసైటీని రూపొందించేలా కృషి చేయాలి. ఆకోయంబత్తూరు గాంధీగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్కు పేరుంది. నిత్యం ప్రజలకు సేవ చేయాలని తపన పడుతూ ఉంటారు. పుట్టపర్తి అనేది బాబా పవిత్ర భూమి. ప్రస్తుతం సత్యసాయి జయంత్యుత్సవాలకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో సహ రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారంతా వచ్చారు. #సత్యసాయి బాబా గొప్పదనం ఇదని ముఖ్యమంత్రి వివరించారు. అంతకు ముందు పుట్టపర్తికి చేరుకున్న ఉప రాష్ట్రపతికి విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, కందుల దుర్గేష్, “సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యకుమార్, సవిత, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు.














