మంగళగిరి (చైతన్య రథం): రతనాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంగళగిరివద్ద సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ లాంఛనంగా దీనిని ప్రారంభించారు. మంగళగిరిలోని మయూరి టెక్‌పార్క్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. దాదాపు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకానుంది. ప్రపంచ అవసరాలు తీర్చే స్టార్టప్ కేంద్రంగా విలసిల్లేలా కార్యాచరణను సిద్ధం చేశారు. అమరావతి కేంద్రంగా ఏర్పాటయ్యే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్.. డీప్‌సీక్, కృత్రిమ మేధ, సుస్థిర, సమ్మిళిత ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తుంది. దీనిలో భాగంగా అమరావతిని క్వాంటమ్ వ్యాలీ కేంద్రంగా తీర్చిదిద్దడంతోపాటు ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు ప్రామాణికంగా రూపొందిస్తారు. ప్రపంచ మేధను ఆకర్షించి.. పెట్టుబడులు, ఇన్నోవేషన్ ఆధారిత విధానాలకు అధిక ప్రాధాన్యమిస్తారు.