- మైనారిటీ సంక్షేమ వసతిగృహాలకు చెల్లింపు
- న్యాయ, మైనార్టీ సంక్షేమ మంత్రి ఫరూక్
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలోని మైనారిటీ సంక్షేమ వసతిగృహాలకు సం బంధించి పెండిరగ్ డైట్ బకాయిల చెల్లింపులు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5.50 కోట్లు విడుదల చేసిందని న్యాయ, మైనార్టీ సంక్షేమ మంత్రి ఫరూక్ ఒక ప్రకటనలో తెలిపారు. 20 24-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డైట్ బకాయిల చెల్లింపుల కోసం నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి చెల్లింపులు ఏపీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా చెల్లించడం జరుగుతుందని వివరించారు.