తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అభ్యుదయభావాలు, సమసమాజ సిద్ధాంతాలతో, సంస్కరణలతో తెలంగాణ ప్రాంతం పై తనదైన ముద్ర వేశారు. ఆయన అధికారంలోకి వచ్చే నాటికి ఆంధ్ర ప్రాంతంలో మునసబు, కరణాలు... తెలంగాణలో పటేల్, పట్వారీలు గ్రామీణ ప్రాంతాలను తమ గుప్పిట పెట్టుకుని ప్రజలను శాసించేవారు. ఎన్టీఆర్ ఆ వ్యవస్థలను రద్దుచేయడంతో బడుగులకు స్వేచ్ఛ దొరికింది. వారందరినీ ఎన్టీఆర్ రాజకీయాలలోకి ఆహ్వానించి ప్రోత్సహించారు. ఫలితంగా తెలంగాణలో బీసీ, దళిత నేతలు రాజకీయాల్లో రాణించారు.
ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన ఎన్టీఆర్ అక్కడి గిరిజనుల బతుకులను చూసి చలించిపోయారు. ఆ తర్వాతనే గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు గిరిజనులకే చెందాలని, గిరిజనులకు అటవీ హక్కులు ఉండాలని... ఇలా 14 నిర్ణయాలు తీసుకుని జీవోలు జారీ చేసారు. అలాగే వలసలు ఎక్కువగా ఉన్న.. ఆదిలాబాద్, మహబూబ్ నగర్.. వంటి జిల్లాల్లో వివిధ పథకాలను అమలు చేసి.. అక్కడ నుంచి ప్రజలు వలసబాట పట్టకుండా ఎన్టీఆర్ చర్యలు తీసుకున్నారు.
పాలమూరు ప్రాంతంగా పిలువబడే నాటి మహబూబ్ నగర్ జిల్లా నుండి కరవును తరిమేసేందుకు ప్రియదర్శిని జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు ఎన్టీఆర్
హైదరాబాద్ లోని ట్యాంక్‌బండ్ మీద కొలువుదీరిన తెలుగు సాహిత్య, సాంస్కృతిక, వైతాళికుల విగ్రహాలు చూడగానే ప్రజలకు గుర్తొచ్చేది ఎన్టీఆరే. 'తెలుగు వెలుగుల మూర్తి నిక్షిప్త కళా ప్రాంగణం' పేరిట విగ్రహాల ఏర్పాటు, ట్యాంక్‌బండ్ సుందరీకరణ... బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పేరిట హుస్సేన్‌సాగర్ మధ్య బుద్ధుని విగ్రహం ఏర్పాటు... ఇవన్నీ ఎన్టీఆర్.కృషికి నిదర్శనాలు.
హుస్సేన్‌సాగర్ పక్క నుంచి ఖైరతాబాద్ వరకు ఉన్న కచ్చా రోడ్డును విస్తరించింది... పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వరకు, కూకట్పల్లి నుంచి చార్మినార్ వరకు రోడ్డు విస్తరణ చేపట్టింది ఎన్టీఆర్ హయాంలోనే.
హైదరాబాద్ లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నెలకొల్పింది... అదే ప్రాంగణంలో లలిత కళాతోరణం ఆడిటోరియంను నిర్మించింది ఎన్టీఆరే.
హైదరాబాద్ నగరానికి రాజధానికి తగ్గ స్థాయిలో అత్యంత విశాలమైన ఇమ్లిబన్ (మహాత్మాగాంధి) బస్ స్టేషన్‌ను నిర్మించింది ఎన్టీఆరే. అంతకు ముందు గౌలిగూడలో ఒక రేకుల షెడ్డు వంటి బస్టాండ్ ఉండేది. తెలంగాణ ప్రజల కోరికను మన్నిస్తూ... 1985 డిసెంబర్లో స్థానికేతరులను వారివారి ప్రాంతాలకు పంపడానికి 610 జీఓను తీసుకొచ్చారు.
నారా చంద్రబాబు నాయుడు హయాంలో...
యువతకు వేలల్లో ఐ టి ఉద్యోగాలిస్తోన్న హైటెక్ సిటీ... అభివృద్ధికి అద్దంలా నిలిచే సైబర్ సిటీ.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్, ఎం ఎం టి ఎస్ పరుగులు, ఫ్లై ఓవర్లు, మల్టీప్లెక్సులు, బిజినెస్ స్కూళ్ళు, అంతర్జాతీయ వ్యాపార సంస్థలు.... హైదరాబాద్ లో ఇంతటి అభివృద్ధికి బాటలు వేసింది నూటికి నూరుపాళ్లూ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వమే. ఈరోజు మామూలు డిగ్రీ చదివిన వ్యక్తి, హైదరాబాద్ వస్తే ఉపాధి దొరుకుతుంది అనే భరోసా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే.
తన విజన్ 2020 ఆలోచనలకు చంద్రబాబు ఇచ్చిన తొలిరూపమే సైబరాబాద్. అప్పటివరకు హైదరాబాద్, సికింద్రాబాద్ అనే జంట నగరాల సరసన అత్యాధునిక అభివృద్ధికి ప్రతీకగా నిలిచింది సైబరాబాద్.
ఐటీ రంగంతో పాటు నానక్ రామ్ గూడలో లక్షల మందికి ఉపాధిని ఇస్తోన్న అద్భుతమైన ఆర్థిక నగరం ఏర్పాటుకు కృషి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే.
అలాగే బీమా రంగం. నాడు చంద్రబాబు నాయుడు పట్టుబట్టి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అధారిటీ (ఐఆర్డీఏ) అనే కేంద్ర సంస్థను, హైదరాబాద్ నగరానికి తీసుకుని రావడంతో... బీమా సంస్థలు నగరానికి వరుసగట్టాయి.
హైదరాబాద్ ను బయోటెక్ హబ్ గా చేయటంలో కూడా చంద్రబాబు కృషి మర్చిపోలేనిది. శామీర్ పేట ప్రాంతంలో నెలకొన్న బయోటెక్ సంస్థలే ఇందుకు నిదర్శనం. ప్రపంచానికి కొవాగ్జిన్ వాక్సిన్ ను అందించి కరోనాకు అడ్డుకట్ట వేసి భారతదేశం గర్వించేలా చేసిన భారత్ బయో టెక్... నాడు చంద్రబాబు నెలకొల్పిన జీనోమ్ వ్యాలీలోనే ఉంది
హైదరాబాద్ లో రద్దీ రోడ్లపై ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ నగరంలో 19 ఫ్లై ఓవర్లు నిర్మించారు చంద్రబాబు.
గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్, కోట్ల విజయ భాస్కరరెడ్డి స్టేడియం.. సరూర్ నగర్ స్టేడియం.. వంటి అనేక క్రీడా ప్రాంగణాలను నిర్మించి... 2002లో 32వ నేషనల్ గేమ్స్, 2003లో మొదటి ఆఫ్రో-ఆసియన్ గేమ్స్ ను హైదరాబాదులో నిర్వహించి నగరానికి క్రీడా రాజధానిగా అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చారు.
పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి చంద్రబాబు స్థలమిచ్చి, ప్రోత్సహించి పీవీ సింధు వంటి క్రీడాకారులు దేశానికి పతకాలు తెచ్చేందుకు కారణమయ్యారు
బిల్ గేట్స్, బిల్ క్లింటన్, టోనీ బ్లెయిర్ వంటి ప్రపంచ ప్రఖ్యాతులను హైదరాబాద్ కు రప్పించి, ప్రపంచ పటంపై హైదరాబాద్ కు గుర్తింపు తెచ్చారు.
మైక్రోసాఫ్ట్, విప్రో, ఐ ఎస్ బి, ట్రిపుల్ ఐటి, నల్సార్ లాంటి సంస్థలు హైదరాబాద్ కు రావటం వెనుక చంద్రబాబు పడిన శ్రమ అనితరసాధ్యం.
పచ్చదనం-పరిశుభ్రత అంటూ హైదరాబాద్ ను ఆహ్లాదకర నగరంగా తీర్చిదిద్దారు. నగర ప్రజల కోసం శిల్పారామం వంటి ఆహ్లాదకర విహార కేంద్రాన్ని నెలకొల్పారు.
నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ గార్డెన్స్, జలగం వెంగళరావు పార్క్, KBR పార్క్, కృష్ణకాంత్ పార్క్, సంజీవయ్య పార్క్, జలవిహర్ వంటివి ఈరోజు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయంటే అది తెలుగుదేశం పాలన ఫలితమే
తెలుగుదేశం హయాంలో తెలంగాణ లో ఏర్పాటైన మరికొన్ని సంస్థలు:
ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం
మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ..
IIIT
టెలికాం రెగ్యులేటరీ అధారిటీ
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్
ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్
మైక్రోసాఫ్ట్..ఇన్ఫోసిస్..విప్రో..ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇన్ఫోటెక్, కాన్ బే... వంటి ఎన్నో సాఫ్ట్ వేర్ సంస్థలు