- ఉత్తమ విద్య కూటమి ప్రభుత్వం లక్ష్యం
- జగన్‌రెడ్డిలా రంగులు, బొమ్మల పిచ్చి లేదు
- మంత్రి నిమ్మల రామానాయుడు
పాలకొల్లు(చైతన్యరథం): రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ విద్యను అందించడమే కూట మి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గురువారం పాలకొల్లు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో, పట్టణ వార్డుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో తల్లిదండ్రు లు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు ఒక పండుగ వాతావ రణంలో జరిగాయి. ఆయా పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనాలు చేశారు. పాల కొల్లు పట్టణంలోని బీవీఆర్‌ఎం బాలికల మున్సిపల్ ఉన్నత పాఠ శాల, ఆదిత్య జూనియర్ కళాశాల, లంకలకోడేరు జడ్పీ ఉన్నత పాఠశాలల్లో జరిగిన ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల ఆత్మీయ సమా వేశంలో మంత్రి రామానాయుడు పాల్గొన్నారు. బాలికల పాఠశా లలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. బిడ్డలంద రికీ తల్లికి వందనం అందజేస్తూ చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. జగన్ అమ్మఒడితో మాట తప్పి ఒక్కరికి మాత్రమే అమలు చేశారన్నారు. వన్ క్లాస్, వన్ టీచర్ నూతన విధానంతో మోడల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నా రు. గత పాలనలో మాదిరిగా రంగులు, బొమ్మల పిచ్చితో కాకుం డా నాణ్యమైన బ్యాగులు, బెల్టులు, పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకా లు వంటివి అందజేశామని తెలిపారు.
మంత్రి లోకేష్ విద్యా విధా నంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఎంఈవో లు గంగాధర శర్మ, వీరాస్వామి, ప్రధానోపాధ్యాయులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు గండేటి వెంకటేశ్వరరావు, నాయకులు కోడి విజయభాస్కర్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కర్నేన రోజారమణి, పాలకొల్లు పట్టణ మహిళా అధ్యక్షురాలు దబ్బ ఎస్తేరు రాణి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కర్నేన గౌర్నాయుడు, క్లస్టర్ ఫోర్ ఇన్‌చార్జ్ గాదె చిన్న వెంకన్న, 19వ వార్డు ప్రెసిడెంట్ శ్రీకాకుళపు వెంకటేశ్వరరావు, తమ్మినీడి సత్య నారాయణ, జనసేన నాయకులు తుల రామలింగేశ్వరరావు విన్న కోట గోపి, సర్పంచ్ కోలాటి రాధ, ఎంపీటీసీ ఆకుల ధనలక్ష్మి, నెక్కింటి ఆదినారాయణ, పెనుమత్స సత్యనారాయణ రాజు, కుడక కోటేశ్వరరావు, నల్లమోతు సత్యప్రసాద్, వేగేశ్న మురళీకృష్ణంరా జు, తదితర నాయకులు పాల్గొన్నారు.