- జిల్లా స్థాయిలో పురగతిపై కలెక్టర్లు పర్యవేక్షించాలి
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్
- ప్రతిపాదనలను ఎస్‌ఐపీసీకి సిఫార్సు చేయాలని నిర్ణయం
అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ(ఎస్‌ఐపీసీ) సమా వేశం సోమవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన వివిధ కంపెనీలు, సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఈ కమిటీ చర్చించి తదుపరి ఆమోదం నిమిత్తం ఎస్‌ఐపీబీకి సిఫార్సు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నీరబ్‌కుమార్ ప్రసాద్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రాకర్ అంశంపై అధికారులతో సమీ క్షించారు. అదేవిధంగా పెద్దఎత్తున పెట్టుబడులు, ఉపాధి కల్పనా యూనిట్లను పర్యవేక్షిం చాలని ఆయా శాఖలను ఆదేశించారు. జిల్లా స్థాయిలో సంబంధిత శాఖాధిపతి సహా యంతో జీఎం డీఐసీ, రాష్ట్రస్థాయిలో శాఖాధిపతులు యూనిట్ల పురోగతిని ఎప్పటికప్పు డు పర్యవేక్షించాలని ఆదేశించారు. 2 వేల మందికి ఉపాధి కల్పించే యూనిట్‌ను ఏర్పా టు చేయడానికి టీసీఎస్ చేసిన ప్రతిపాదనకు ఎస్‌ఐపీబీకి సిఫార్సు చేసింది. రూ.65 వేల కోట్లతో వివిధ జిల్లాల్లో 500 యూనిట్ల ఏర్పాటుకు రిలయన్స్ చేసిన ప్రతిపాదనకు కూడా ఎస్‌ఐపీబీకి సిఫార్సు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఆ శాఖ డైరెక్టర్, ఏపీఐ ఐసీ వీసీ అండ్ ఎండీ అభిషిక్త్ కిశోర్, ఏపీ ఈడీబీ సీఈవో సాయికాంత్ వర్మ, ఏపీ మారిటైం బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్య, పరిశ్ర మల శాఖ జేడీ రామలింగేశ్వరరాజు తదితరులు పాల్గొనగా రెవన్యూ, ఇంధన శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఆర్.పి.సిసోడియా, కె.విజయానంద్, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాజ్, చీఫ్ కమిషనర్ స్టేట్ టాక్సెస్‌బాబు వర్చువల్‌గా పాల్గొన్నారు.