అమరావతి(చైతన్యరథం): ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. బుధవారం ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. రవాణా, పార్కింగ్ ఎంతో కీలకమని.. వర్షం వస్తే పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూడాలని సీఎం సూచన మేరకు పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చామని వివరించారు. 3000 బస్సులు,1000 కార్లకు పార్కింగ్ ఏర్పాట్లు ముందుగానే చేశామని, 5 లక్షల పైగా జనాభా వచ్చే అవకాశం ఉండటంతో పార్కింగ్‌కు మరిన్ని ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 6500 -7000 బస్సులు, 3000 కార్లకు పార్కింగ్ ఏర్పాటు చేస్తు న్నారు. ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానమేనని వివరించారు. అన్ని శాఖలు సమ న్వయంతో ముందుకువెళున్నాయని తెలిపారు.