అమరావతి (చైతన్యరథం): ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద సెప్టెంబరు 1న 63,61,380 మంది లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ చేసేందుకు రూ.2,746.52 కోట్లు గ్రామ, వార్డు సచివాల యాలకు విడుదల చేసిందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ లు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా మంజూరైన 7,872 మంది స్పౌజ్ పెన్షన్ లబ్ధిదారులకు సెప్టెంబ రు 1న పెన్షన్ పంపిణీ చేయడానికి రూ.3.15 కోట్లు కూడా విడుదల చేశామని మంత్రి చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్స రానికి పింఛన్ల కోసం రూ.32,143 కోట్లు బడ్జెట్ కేటాయించగా, ఇందులో ఏప్రిల్ నుంచి సెప్టెంబరు 2025 వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి రూ.16,366.80 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షన్ కోసం రూ.10 వేల కోట్లకు మించి కేటాయించడం లేదని తెలిపారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలా, లబ్ధిదా రుల ఇంటి వద్దే పెన్షన్ అందించడంతో పాటు వారి జియో -కోఆర్డినేట్స్ ను కూడా నమోదు. చేస్తున్నామని అన్నారు. ముఖ్య మంత్రి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. వృద్ధులు. వితంతు వులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు వంటి నిరుపేద, నిస్సహా య వర్గాల కష్టాలను తొలగించడానికి ఎన్టీఆర్. భరోసా పెన్షన్ పథకాన్ని ఒక ముఖ్యమైన సంక్షేమ పథకంగా అమలు చేస్తోందని తెలిపారు. దేశంలో సామాజిక భద్రతా పెన్షన్. కోసం అత్యధిక మొత్తాన్ని ఖర్చు చేస్తున్నది. రాష్ట్రమేనని వివరించారు.