- అనర్హులను ఏరివేతకు చర్యలు
- ఇప్పటికీ లక్షమందిని గుర్తించాం
- 50 వేల మంది పున:పరిశీలనకు రాలేదు
- సమాచార మంత్రి కొలుసు పార్థసారథి
అమరావతి(చైతన్యరథం): బోగస్ సదరం సర్టిఫికెట్లతో దివ్యాం గుల పింఛన్లను పొందే అనర్హులను ఏరివేసేందుకే సదరం సర్టిఫికె ట్ల పున:పరిశీలన కార్యక్రమం జరుగుచున్నదని సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. గతంలో ఉన్న అర్హతలను బట్టే సర్టిఫికెట్ల పున:పరిశీలన జరుగుతుందని, అర్హతలను మార్చి పింఛనుదారులకు అన్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఏ మాత్రం ప్రవర్తించడం లేదని ఆయన తెలిపారు. బుధవారం సచివాలయం ప్రచార విభాగంలో మీడియాతో మాట్లాడారు. దివ్యాంగులకు ఇచ్చే రూ.6 వేల పెన్షన్ ను గత ప్రభుత్వం హయాంలో అనర్హులకు కూడా మంజూరు చేసి దుర్వినియోగం చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో మొత్తం 7.86 లక్షల మంది దివ్యాంగ పింఛన్లను పొందడం జరుగు తుందని, వారిలో 5.10 లక్షల మందికి చెందిన సదరం సర్టిఫికె ట్లను పున:పరిశీలించేందుకు నోటీసులు జారీచేయడం జరిగింద న్నారు. అయితే ఇప్పటివరకూ 4.50 లక్షల మంది వారి సర్టిఫికెట్ల ను తనిఖీ చేయించుకోగా వారిలో దాదాపు ఒక లక్ష మంది అనర్హులు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. అదే విధంగా మిగిలిన వారు తమ సర్టిఫికెట్లను రీవెరిపై చేయించుకొనేందుకు ముందుకు రాలేదన్నారు. వీరందరికీ మరోసారి నోటీసులు జారీ చేస్తామని, అప్పటికీ వారు ముందుకు రాకపోతే వారి పింఛన్లను నిలుపుదల చేస్తామని తెలిపారు.
అయితే వైద్యులు ఎవరిని అయితే అనర్హులు గా ధృవీకరించారో వారు మరోసారి తమ అర్జీని మండల అభివృద్ధి అధికారి, మున్సిఫల్ కమిషనర్‌కు అందజేసినట్లయీతే మరోసారి వారి అర్హతను పరిశీలించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలో సదరం సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్ జరిగిందని, అయి తే అత్యధికంగా పులివెందులలోనే 1,708 మంది బోగస్ పింఛను దారులు ఉన్నట్లు గుర్తించడమైందన్నారు. అదేవిధంగా మచిలీప ట్నంలో 1,539 మంది, చంద్రగిరిలో 1,604 మంది బోగస్ పిం ఛనుదారులను గుర్తించినట్లు చెప్పారు. అదేవిధంగా అత్యల్పంగా కాకినాడలో 19 మంది, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 39 మంది, తాడికొండలో 55 మందిని గుర్తించినట్లు చెప్పారు. అర్హులకు మాత్రమే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తుంద న్నారు. ఇటువంటి ప్రయత్నాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఇతర పార్టీలు ఏ విధంగా తప్పుపడతాయని ఆయన ప్రశ్నించారు. దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వా నిదని రాష్ట్ర ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం రూ.3 వేల పింఛను ఇస్తానని మోసం చేయడం జరిగిందని మండిపడ్డారు.
వైసీపీ దుష్ప్రచారం
రాష్ట్ర ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ విషం చిమ్మడం ఎంతో దురదృష్టకరమన్నారు. రాజధాని అమరా వతిపై గత ప్రభుత్వానికి ఉన్న ద్వేషంతో ఎటువంటి అభివృద్ది పనులు నిర్వహించకపోవడం వల్లే ప్రస్తుతం ఇబ్బందులు ఏర్పడ్డా యని తెలిపారు. రాజధాని ప్రాంతం ముంపుకు గురైందని దుష్ప్ర చారం చేయడం అంటే రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే అని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో భవిష్యత్తులో జరిగే నిర్మాణా లు, కట్టడాలు ఏ మాత్రం వరద నీటికి గురవ్వకుండా ఉండేందుకు అవసరమైన వరద నీటి పారుదల వ్యవస్థలను ప్రభుత్వం ప్రణాళి కాబద్ధంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు.
4 రోజుల్లో 47 లక్షల మంది ప్రయాణం
గత నాలుగు రోజుల్లో దాదాపు 47 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారని తెలిపా రు. ఇటువంటి మంచి పథకంపై కూడా విషం చిమ్మే విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ చేయడం సిగ్గుచేటన్నారు. కొండ ప్రాంతాల్లో మహళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అనుమతించడం జరిగింద న్నారు.