మాటిచ్చి మరీ నెరవేర్చిన మంత్రి లోకేష్
ధన్యవాదాలు తెలిపిన మాంచో ఫెర్రర్
ఉండవల్లి (చైతన్య రథం): పేదోడి నోటికాడ ముద్ద.. నిరుపేదలకు అందని చదువులను అందించిన విద్యాలయం.. పైసలులేని వారికి రోగమొస్తే నయంచేసే ఆరోగ్యాలయం.. చిన్నారుల చిద్విలాసం.. తెలుగు రాష్ట్రాల వెలుగు కిరణం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి అడ్డంకులన్నీ తొలగాయి. లక్షలాది ప్రజల ఆశాజ్యోతి ఆర్డీటీని రక్షించుకుంటాం.. అని మాటిచ్చిన మంత్రి నారా లోకేష్.. అసాధ్యం అనుకున్న పనిని తనదైన శైలి మంత్రాంగంతో సుసాధ్యం చేశారు. కేంద్రంతో మాట్లాడి ఆర్డీటీ అడ్డంకులు తొలగించారు. ఈ నేపథ్యంలో ఆర్డీటీ నిర్వాహకుడు మాంచో ఫెర్రర్ మంగళవారం ఉండవల్లిలోని నివాసానికి విచ్చేసి మంత్రి నారా లోకేష్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇది ఆర్డీటీ ఒక మంత్రికి చెబుతున్న కృతజ్ఞతలు కాదు, ఆర్డీటీ తరఫున లక్షలాది ప్రజలు మంచిపని చేసిన మంచి మనిషికి అందిస్తున్న ఆశీస్సులు అని చెప్పారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. నిస్వార్థంగా దశాబ్దాలుగా తెలుగు ప్రజలకు విద్య, వైద్య, ఉపాధి, శిక్షణ ద్వారా ఆర్డీటీ అందిస్తున్న సేవలు ముందు తాను చేసిన పని చాలా చిన్నదని అన్నారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద స్వచ్ఛంద సంస్థలకు విదేశాలనుంచి వస్తున్న నిధులను నిలిపివేస్తూ కేంద్రం గతంలో ఉత్తర్వులిచ్చింది. దీంతో ఆర్డీటీకి నిధులు ఆగిపోయాయి. ఈ విషయాన్ని గతంలోనే లోకేష్ దృష్టికి ఫెర్రర్ తీసుకొచ్చారు. తానున్నానని అభయమిచ్చిన లోకేష్ కేంద్ర పెద్దలతో మాట్లాడారు. “లక్షల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఆశాకిరణం ఆర్డీటీ. ఈ ట్రస్టును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ. ట్రస్టు సేవలు నిరంతరం కొనసాగించేందుకు పూర్తిస్థాయి ప్రయత్నం చేస్తాం” అని ఫెర్రర్‌కు, ప్రజలకు మాటిచ్చిన లోకేష్ తన మాట నిలబెట్టుకున్నారు. సున్నితమైన సమస్యను సమయస్ఫూర్తిగా పరిష్కరించారు. ఆర్డీటీకి విదేశాలనుంచి నిధుల రాకకు మార్గం సుగమం చేశారు. దీనిపై ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.