- కలెక్టర్లనుంచి కార్యదర్శిలు రిపోర్టులు కోరవద్దు
- క్షేత్రస్థాయి సమాచారాన్ని ఆర్టీజీఎస్ నుంచి తీసుకోవాలి
- మెరికల్లాంటి యువ ఐఏఎస్ సేవల్ని వాడుకుంటాం
- టెక్నాలజీ వినియోగంపై మంత్రులు, కలెక్టర్లకు శిక్షణ
- నవంబర్ నుంచి అందుబాటులోకి ఆర్టీజీ జిల్లా కేంద్రాలు
- రెండోరోజు కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం
- క్వాంటం భవనాల డిజైన్లపై కలెక్టర్ల అభిప్రాయం కోరిన సీఎం
అమరావతి (చైతన్య రథం): వివిధ ప్రభుత్వ శాఖలు అందించే సేవలకు ఇకపై రేటింగ్స్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. క్వాంటం వ్యాలీ, వాట్సప్ గవర్నెన్స్, డేటా లేక్, ఆర్టీజీఎస్ లెన్స్, అవేర్ 2.0 అంశాలపై సీఎం సమీక్షించారు. పాలనలో టెక్నాలజీ వినియోగంపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “కొన్ని ప్రభుత్వ శాఖల పనితీరు మరింతగా మెరుగుపడాల్సిన అవసరముంది. గతంతో పోల్చుకుంటే కొన్ని శాఖల పనితీరు మెరుగైనా.. రెవెన్యూలాంటి శాఖల పనితీరు మరింత బాగుపడాలి. ఎన్నిసార్లు చెబుతున్నా రెవెన్యూ శాఖ ప్రజలకు సంతృప్తస్థాయిలో సేవలు అందించటం లేదు. ఈ పరిస్థితుల్లో అన్ని ప్రభుత్వ సేవల్ని రేటింగ్ చేయాలని నిర్ణయించాం. కలెక్టర్లు చూసే దస్త్రాల క్వాలిటీ ఎంత ఉందో కూడా తనిఖీ చేస్తాం. సీనియర్ అధికారులు కూడా తమ పని విధానం మార్చుకోవాలి. ఇకపై తమ తమ శాఖలకు సంబంధించిన క్షేత్రస్థాయి సమాచారం కోసం పదే పదే కలెక్టర్లను నివేదికలు అడిగే పరిస్థితి రాకూడదు. ఆర్టీజీఎస్ నుంచి అవసరమైన మేరకు నివేదికలు తీసుకోవాలి. దానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో పని చేయించాలి. ఉన్నతాధికారులు కలెక్టర్లను రిపోర్టులు కోరుతూ ఉండడంవల్ల పనులు ముందుకు కదలడం లేదనే విమర్శలు వస్తున్నాయని. ఇకపై ఇలాంటి వాటికి చెక్ పెట్టాలి. ఆ కాలం ముగిసింది” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఫైళ్లన్నీ ఆన్ లైన్ చేయాల్సిందే..
“రెండు నెలల్లో నూరుశాతం ఫైళ్లు ఆన్ లైన్లో ఉండాల్సిందే. మానుప్యులేషన్ లేకుండా ఫోరెన్సిక్ ఆడిటింగ్ లాంటివి కూడా తీసుకువస్తాం. నెక్స్ట్ జెన్ టెక్నాలజీవైపు మనం ముందడుగు వేయాలి. ఆర్టీజీఎస్ ద్వారా అవేర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. దీని ద్వారా 42 రకాల సమాచారం కలెక్టర్లకు అందుతోంది. నవంబరు నెలలోగా డేటా లేక్ పూర్తిగా అందరికీ అందుబాటులోకి వస్తుంది. వచ్చే కలెక్టర్ల సదస్సునాటికి ఏయే జిల్లాలు ఎక్కడెక్కడ తమ పనితీరు మెరుగుపరుచుకోవాలో కూడా రియల్ టైమ్లో చెప్పేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. లాస్ట్ మైల్ వరకూ ప్రయోజనాలు అందేలా టెక్నాలజీ వినియోగించాలి. వచ్చే రెండేళ్లలో ఈ ఫలితాలను కూడా అందుకోవచ్చు. ఆర్టీజీ జిల్లా కేంద్రాలు నవంబర్నాటికి సిద్ధమవుతాయి. టెక్నాలజీ వినియోగంపై అక్టోబరు నెలలో మంత్రులు,అధికారులు, కలెక్టర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తాం” అని సీఎం వెల్లడించారు.
వివిధ ప్రాంతాల్లో చేపట్టాలి. అలాగే సీసీ టీవీ ఫుటేజీలను అనాలసిస్ చేసే పరిస్థితి తీసుకురావాలి. బ్యాండ్ విడ్డేని సమయం నుంచి అత్యధిక బ్యాండ్ విడ్తో పనిచేసే సమయం వచ్చింది. చురుగ్గా ఉండే యువ అఖిల భారత సర్వీసు అధికారుల సేవల్ని వినియోగించుకుంటాం. ఏపీలో టెక్నాలజీ ఎకో సిస్టం క్రియేట్ చేసేందుకు ఐదుగురు యువ అధికారులను నియమించాం. టెక్నాలజీ రంగంతోపాటు… ఇన్నోవేషన్వంటి రంగాల్లో కూడా యువ ఐఏఎస్లకు బాధ్యత అప్పజెప్పాం. ఇటీవల కాలంలో నేను చాలామంది ఐఏఎస్లతో మాట్లాడాను. కొందరు యువ ఐఏఎస్లలో చాలా ఆలోచనలు ఉన్నాయి. చాలా వినూత్నంగా ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్లను పికప్ చేస్తున్నాం” అని చంద్రబాబు చెప్పారు.
క్వాంటం భవనాల డిజైన్లు
కలెక్టర్ల కాన్ఫరెన్సులో క్వాంటం వ్యాలీ భవనాల డిజైన్లను ప్రదర్శించారు. ఆ భవనాలపై కలెక్టర్ల అభిప్రాయాలను సీఎం కోరారు. భవిష్యత్తులో 3 వేల క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటుకు వీలుగా కార్యాలయ స్థలం అందుబాటులోకి రానున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. 80వేలమంది పని చేసేలా క్వాంటం వ్యాలీ భవనాల నిర్మాణం చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు వివరించారు.
టెక్నాలజీ ఎకో సిస్టం తెస్తాం
“ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ… ఇతర అత్యవసర సమయాల్లో ప్రజలను అలెర్ట్ చేసేలా అలెర్ట్ బ్రాడ్ కాస్ట్ సిస్టం ఏర్పాటు చేయాలి. దీన్ని