(అమరావతి), చైతన్య రథం: మూడున్నర దశాబ్దాలపాటు అప్పన్న సేవలో తరించిన ప్రధాన అర్చకులు రమణాచార్యుల మరణించడం విచారకరమని సీఎం చంద్రబాబు అన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్టు పుడుతూ `సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ప్రధానార్చకులుగా రమణాచార్యులు పవిత్రమైన సేవలు అందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. రమణాచార్యులు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. భక్తికి, బల సంపన్నతకు, నమ్మకానికి ప్రతిరూపమైన ఆంజనేయుడు అన్నివేళలా మనకు అండగా నిలిచి, మనం చేపట్టే పనులలో విజయాలను కలిగించాలని కోరుకుంటున్నా. భక్తులందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.