అమరావతి (చైతన్య రథం): నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అక్షయపాత్ర ద్వారా నాణ్యమైన భోజనం అందుతుండటంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి కృషిచేసిన విద్య, ఐటీ మంత్రి నారా లోకేశ్కు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల నూజివీడు ట్రిపుల్ ఐటీలో భోజనం సరిగా పెట్టడం లేదని, నిర్వహణ సక్రమంగా లేదంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ట్రిపుల్ ఐటీల్లో మెస్ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం అక్షయపాత్రకు అప్పగించింది. దీంతో నూజివీడు విద్యార్థులు ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న భోజన సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపిన మంత్రి నారా లోకేశ్కు ఈ సందర్భంగా విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. అక్షయపాత్ర ద్వారా అందిస్తున్న పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భోజనాలతో ఇప్పుడు నిజమైన మార్పు కనిపిస్తోందని, మాట నిలబెట్టుకున్నందుకు ధన్యవాదాలు అంటూ తమ సంతోషాన్ని తెలియజేశారు. ఈ పరిష్కారాన్ని శాశ్వతంగా కొనసాగించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.