- 45 మంది అక్రమార్కులకు అధికారుల అండ
- ప్రజావినతుల్లో పులిచింతల నిర్వాసితుల ఫిర్యాదు
- అర్జీలు స్వీకరించిన పీతల సుజాత, కొమ్మాలపాటి
మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. శుక్రవారం నుంచి గ్రామాల్లోనే రెవెన్యూ సదస్సులు ప్రారంభం అయ్యాయని.. ప్రజలు భూ సమస్యలను అక్కడే పరిష్కరించుకోవాలని సూచించారు. అక్కడ పరిష్కారం కాని పక్షంలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి రావాలని తెలిపారు. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం ఎమ్మాజీ గూడెంకు చెందిన పులిచింతల నిర్వాసితులు తమ సమస్యను వివరిస్తూ తమ గ్రామంలో ముంపు బాధితుల పరిహార పంపిణీలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేశారు. 45 మంది అక్రమార్కులకు అధికారులు అప్పనంగా డబ్బులు కట్టబె ట్టారని..దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం స్టాక్ పాయింట్లో రేషన్ బియ్యం గోడౌన్ నుంచి రేషన్ మాఫియా బియ్యాన్ని తరలిస్తున్నారని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించు కోకపోవడంతో నిందితులు తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని పొలినాటి వీరబా బు ఫిర్యాదు చేశాడు. అధికారులు రేషన్ మాఫియాను పట్టుకుని వారిపై కఠిన చర్య లు తీసుకోవాలని కోరారు.
` బాపట్ల జిల్లా నగరం మండలం అల్లపర్రు గ్రామానికి చెందిన తూమాటి శ్రీనివాసరావు సమస్యను వివరిస్తూ తాము కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించకున్న పొలంలో అక్రమంగా మట్టిని తోలడమే కాకుండా తమపై వంకాయల సురేష్, అతని భార్య దాడికి దిగారని ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకుని తమ భూమిని తమకు దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
` తన స్థలంలో రోడ్లు వేస్తూ కాలువలు తవ్వుతున్నారని.. అక్రమాన్ని ప్రశ్నిస్తే తమను బెదిరిస్తున్నారని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కొత్తవలసకు చెం దిన తీగల వెంకట రమణాజీరావు ఫిర్యాదు చేశారు. భూ కబ్జాదారుల నుంచి తమకు ప్రాణహాని ఉందని..న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
` ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని.. నూత న భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసి విద్యార్థుల సమస్యలను పరిష్క రించా లని తూమాటి అచ్చయ్య విజ్ఞప్తి చేశాడు.