- జన్మదినం సంర్భంగా టీడీపీ నాయకుల అభినందనలు
- పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు
అమరావతి (చైతన్యరథం): పీపుల్స్ లీడర్ పల్లా శ్రీనివాసరావు నాయకత్వంలో రాష్ట్రంలో టీడీపీ మరింత శక్తిమంతంగా ఎదుగుతుందని పార్టీ నేతలు ఉద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కేట్ కట్ చేసి పల్లా శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నేతలు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 95,235 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి, రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించిన శాసనసభ్యునిగా పల్లా శ్రీనివాసరావు గుర్తింపు పొందారన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటంతో ‘‘పీపుల్స్ లీడర్’’గా నిలిచారన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడంలో ఆయన నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ప్రజా సేవలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆరోగ్యంగా, దీర్ఘాయుషుతో ఉండాలని టీడీపీ కుటుంబం సభ్యులు ఆకాంక్షిస్తున్నారన్నారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ మరింత బలపడి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కృషి చేస్తుందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్ నిలాయపాలెం విజయకుమార్, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు కల్లం సాంబిరెడ్డి, ఏవి రమణ, రాష్ట్ర ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కోడూరు అఖిల్, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు దారు నాయక్, టీడీపీ అధికార ప్రతినిధి పాతర్ల రమేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గ్గొన్నారు.