నాడు అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించుకోవడానికి తండ్రి పేరును ఎఫ్‌ఐఆర్‌లో నమో దు చేయించిన జగన్‌రెడ్డి..తన ఐదేళ్ల అరాచక పాలనలో తనకు అడ్డొచ్చిన వారిపై, తనను ప్రశ్నించే వారిపై బురదజల్లడమే కాదు అక్రమ కేసులు మోపి పైశాచిక ఆనందం పొందా డు. దీనికి సొంత కుటుంబసభ్యులకూ మినహాయింపు లేదనేందుకు తల్లి, చెల్లిపై వేధింపులే నిదర్శనం. ఆస్తి వివాదాల్లో సైకో ప్రవర్తనతో విభేదించి దూరమైన షర్మిలపై, కుమార్తెకు అండగా ఉందన్న కారణంతో తల్లి విజయమ్మపై కక్షసాధింపు చర్యలకూ దిగాడు. తన రాజకీయ క్రీడలో సొంత బాబాయి వివేకానే బలితీసుకున్న జగన్‌రెడ్డి..అదే కేసులో తనను పదేపదే ప్రశ్నిస్తూ ఇబ్బందిపెడుతోందన్న కారణంగా ఇప్పుడు చెల్లితో పాటు కన్నతల్లిని సైతం వదల్లేదు. సరస్వతీ పవర్స్‌లో వారికి కేటాయించిన షేర్లను వెనక్కు తీసుకునేందు కు కోర్టులో వారిపైనే కేసు వేశాడు. తన రాజకీయ కుట్రలను వ్యతిరేకిస్తే కుటుంబసభ్యుల కు సైతం వదిలేది లేదని నిరూపించుకున్నాడు. నైతిక విలువలు వదిలేశారు.. దారి తప్పారు ..నేరస్తులకు అండగా ఉన్నారు..దోచుకున్నారు అని సొంత చెల్లే ఆయన గురించి చెబు తుందంటే ఆయన సైకో లక్షణాలు ఏపాటివో అర్థం చేసుకోవచ్చు.
తన రాజకీయ లబ్ధి కోసం సరస్వతీ పవర్స్‌లో విజయమ్మ, షర్మిలకు షేర్లు కేటాయించేం దుకు 2019 ఆగస్టు 31న ఎంవోయూలో అంగీకరించాడు. వాస్తవానికి తండ్రి వైఎస్సార్ సంపాదించిన ఆస్తులను నలుగురు మనవళ్లు సమానంగా పంచుకోవాలని ఆయన ఉన్న ప్పుడే నిర్ద్వందంగా చెప్పారన్నది షర్మిల వాదన. అయితే గత ఎన్నికల్లో తనతో విభేదించి వివేకా హత్య కేసులో ప్రశ్నిస్తూ రాజకీయంగా తనను ఇబ్బందిపెడుతోందన్న కక్షతో జగ న్‌రెడ్డి ఆ షేర్లను ఉపసంహరించుని వెనక్కు తీసుకునేలా కేసులు వేశాడు. చెల్లి షర్మిల, తల్లి విజయమ్మతో పాటు జనార్దన్‌రెడ్డి చాగరి, యశ్వంత్‌రెడ్డి కేతిరెడ్డి, రీజనర్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్, రిజిస్ట్రర్ ఆఫ్ కంపెనీస్, తెలంగాణను ఆయన రెస్పాండెంట్లుగా పేర్కొంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఏడాది సెప్టెంబరు 3న ఒక పిటిషన్, 11న మూడు పిటిషన్లు, అక్టోబరు 18న మరో పిటిషన్‌ను జగన్మోహన్‌రెడ్డి, షర్మిలారెడ్డి, క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దాఖలు చేశాడు. ఆయన తరపున వై.సూర్యనారాయణ కంపెనీల చట్టం 59 కింద ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. నవంబరు 8వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేశారు.
కంపెనీ యాక్ట్ క్లాజ్ 59 ప్రకారం సరైన కారణాలు లేకుండా ఒక కంపెనీ రిజిస్టర్‌లో ఒకరి పేరును నమోదు చేయడం లేదా తొలగిస్తే దాన్ని సరిదిద్దాలని కోరుతూ బాధిత పక్షం క్లాట్‌లో అప్పీల్ చేసుకోవచ్చు. అయితే జగన్‌రెడ్డి తన ఇష్ట ప్రకారమే షేర్లను 2019 ఆగస్టు 31న షర్మిల, విజయమ్మలకు రాసి ఇచ్చారు. తనను రాజకీయంగా వ్యతిరేకిస్తున్నారన్న కక్షతో వారిని కోర్టుకు ఈడ్చాడు. ఐదేళ్ల విధ్వంస పాలనలో రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపిన సైకో రాష్ట్ర ప్రజలు సరైన బుద్ది చెప్పి గద్దె దించినా ఆయన తీరు మారలేదు. తన, మన తేడా లేదు సైకో లక్షణాలకు ఎవరూ మినహాయింపు కాదు. నేడు జగన్‌రెడ్డిని చూసి చెల్లి, తల్లి భయపడుతున్నారంటే నాడు ఆయన విధ్వంస పాలనలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో అర్థం చేసుకోవచ్చు. సొంత కుటుంబసభ్యులైన తల్లి, చెల్లినే వేధిస్తున్న సైకో నేడు మహిళల రక్షణ అంటూ పరామర్శల పేరుతో మొసలి కన్నీరు కార్చడం ఆయన నట విశ్వ రూపానికి నిదర్శనం. అధికారం చేపట్టక ముందు రాజకీయ పీఠమెక్కడానికి తల్లిని, చెల్లిని వాడుకుని అధికారం చేపట్టిన తర్వాత వారిని భయబ్రాంతులకు గురిచేసి పారిపోయేలా చేశాడు. ఇప్పుడు వారు భయపడి పక్క రాష్ట్రానికి వెళ్లి తలదాచుకున్నా వదల..మిమ్మల్ని వద లా అంటూ కేసులు పెట్టి వేధిస్తుండటాన్ని చూసి రాష్ట్ర ప్రజలు ఛీకొడుతున్నారు..
-కొల్లి పూజిత, పొలిటికల్ అనలిస్ట్