అమరావతి(చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఏపీలో క్రీడల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులు సమకూర్చ డమే లక్ష్యంగా శాప్ చైర్మన్ రవినాయుడు సోమవారం హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్ సంస్థ లీడ్ కన్సల్టెంట్ ఎం.వంశీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీలో క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి ఇన్ఫోసిస్ నుంచి సీఎస్‌ఆర్ నిధులను కేటాయించి సహక రించాలని కోరారు. తమ వినతికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.