- వక్ఫ్ చట్టంలో కేంద్రం సవరణలు ఆమోదయోగ్యం కాదు
- సీఎం చంద్రబాబుకు విన్నవించిన ముస్లిం సంఘాలు
అమరావతి (చైతన్య రథం): ఆలిండియా ముస్లిం లా బోర్డు సహా ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి ఎన్ఎండి ఫరూఖ్, మండలి మాజీ చైర్మన్ షరీఫ్ సహా పార్టీ మైనారిటీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలిశారు. వక్ఫ్ యాక్ట్ సవరణపై కేంద్రం చేసిన ప్రతిపాదనలపై తమ అభ్యంతరాలు తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన ప్రతిపాదన వల్ల వక్ఫ్‌బోర్డు నిర్వీర్యమవుతుందని…. ఈ చర్య ముస్లింవర్గ హక్కులు, మనోభావాలను దెబ్బతీస్తుందని వివరించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు తమ అభ్యంతరాలను, ఆందోళనను వివరించారు. వక్ఫ్ చట్టంలో మార్పులను అంగీకరించవద్దని, పార్లమెంట్లో చట్టాన్ని వ్యతిరేకించాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. దీనిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ముస్లిం ప్రతినిధులకు తెలిపారు.