అమరావతి(చైతన్యరథం): ఎనిమిదో రోజు శాసనసభ సమావేశాల సంబదర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు పల్లె సింధూరరెడ్డి, మహమ్మద్ నజీర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సమాధానమిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 163 స్టేడియం ఉన్నాయని, 2019 -24 గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం 9 స్టేడియాలు మంజూరు చేయగా 6 మాత్రమే పూర్తి చేశారని వివరించారు. మన ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే 16 నూతన స్టేడియాల కోసం ప్రతిపాదనలు వచ్చాయన్నారు. బ్రహ్మా నందరెడ్డి స్టేడియంలో జాతీయస్థాయి ప్రమాణాలతో జిమ్నాస్టిక్స్ హాలు, నాలుగు అం తస్తుల భవనాన్ని నిర్మించామన్నారు. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తున్నామని తెలిపా రు. ప్రస్తుతం రూ.68 లక్షలతో షాపింగ్ కొంప్లెక్స్, రూ.35 లక్షలతో క్రికెట్ మైదానాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. సత్యసాయి జిల్లాలో మైదానం నిర్మాణానికి చర్యలు కొనసాగు తున్నాయని, ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంచామని వివరించారు. బ్రహ్మానందరెడ్డి స్టేడియాన్ని అత్యాధునికంగా తీర్చుదిద్దుతామని వెల్లడిరచారు. సత్తెనపల్లి లో స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో క్రీడలకు పూర్వవైభవం రావాలని స్పీకర్ అయ్య న్నపాత్రుడు ఆకాంక్షించారు.