అమరావతి (చైతన్యరథం): వైసీపీ పాలనలో రాష్ట్రంలో మత విద్వేషాలకు పాలకులే ఆజ్యం పోశారని మంత్రి మండిపల్లి రాం ప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో గురువారం జరిగిన హై డ్రామాపై మంత్రి స్పందించారు. తిరుమల పవిత్రత గురించి వైసీపీ చేస్తున్న ఆరోపణలే వారి స్వార్ధ రాజకీయాలకు నిదర్శనం అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై దాడుల జరిగాయి. రథాలు తగలబెట్టారు, విగ్రహాలు ధ్వంసం చేశారు. వైసీపీ పాలనలో మత విద్వేషాలకు ఆజ్యం పోశారు. విభజించు, పాలించు ధోరణిలో పరిపాలన చేశారు. వైసీపీ నాయకులు తమ రాజకీయ స్వార్థం గురించి తల్లిని, చెల్లిని, కులాన్ని, మతాన్ని దేన్నయినా వాడుకుంటారని మంత్రి మండిపల్లి దుయ్యబట్టారు.