అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో మత్స్యకారులను అన్ని విధాలా అభివృద్ధే చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత తెలిపారు. మత్స్యకారులకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. ఆదరణ 3.0 పథకం అమలులో కూడా మత్స్యకారులకు ప్రాధాన్యమిస్తామని, ఆధునిక పరికరాలు అందజేస్తామని వెల్లడిరచారు. మంత్రి సవితను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. చైర్మన్‌గా అవకాశమిచ్చినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, మత్స్యకారులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నెరవేరుస్తున్నారన్నారు. ఇప్పటికే వేట విరామ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేస్తూ రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచి అందజేశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు రూ.10వేల చొప్పున మాత్రమే అందజేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేస్తూ కూటమి ప్రభుత్వం రూ.20 వేలు అందజేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.29 లక్షలకు పైగా మత్స్యకారులకు రూ.259 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 217 ను రద్దు చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానిదేనన్నారు. చేపల వేట నిషేధకాలంలో మత్స్యకారులకు భృతి ఇవ్వాలని నిర్ణయించిన ఘనత కూడా సీఎం చంద్రబాబునాయుడిదేనన్నారు. 2014లో తొలిసారిగా వేట నిషేధ సమయంలో భృతి అందజేశారన్నారు. 2014-19 మధ్య అయిదేళ్లో రూ.788 కోట్లు మత్స్యకారులకు భృతి రూపంలో అందజేశామన్నారు. మత్స్యకారులకు 50 ఏళ్లకే ఫించన్లు అందజేసిన ఘనత కూడా టీడీపీదేనన్నారు.లీటర్ డీజిల్ పై రూ.9ల రాయితీ అందజేస్తున్నామన్నారు. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన మత్స్యకారుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందజేస్తున్నామన్నారు.
ఆదరణ 3.0లో ప్రాధాన్యం
త్వరలో ప్రారంభించనున్న ఆదరణ 3.0 పథకంలోనూ మత్స్యకారులకు ప్రాధాన్యమివ్వనున్నట్లు మంత్రి సవిత వెల్లడిరచారు. వేటకు కావాల్సిన ఆధునిక పరికరాలు అందజేసేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకోవడమే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమన్నారు. అంతకుముందు మంత్రి సవితను కలిసిన రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు.. సీఎం చంద్రబాబు తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కృషి చేస్తానని తెలిపారు. దీనిపై మంత్రి సవిత స్పందిస్తూ, మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులకు అందేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మత్స్యకార సంఘ నాయకులు పాల్గొన్నారు.