- ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
- గత ప్రభుత్వం వారి సంక్షేమాన్ని గాలికొదిలింది
- న్యాయ, మైనారిటీ సంక్షేమ మంత్రి ఫరూక్
- సబ్సిడీ రుణాల దరఖాస్తుల వెబ్సైట్ ప్రారంభం
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని మూడవ బ్లాక్ సమావేశపు భవనంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనా రిటీల స్వయం ఉపాధి కోసం రాయితీతో కూడిన బ్యాంకు రుణాల మంజూరు ప్రక్రియ కు సంబంధించి ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టం (ఓబీ ఎంఎంఎస్) వెబ్‌సైట్‌ను మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు ఎన్టీఆర్, చంద్రబాబు సారథó్యంలో రాష్ట్రంలోని మైనా రిటీల సంక్షేమానికి కృషి చేయడం జరిగిందన్నారు.
వేలాది మసీదులు, దర్గాలు, కబర స్థాన్లు, చర్చిలు తదితర మైనారిటీ ప్రాధాన్యత నిర్మాణాలకు కోట్లాది రూపాయలను ఖర్చు చేసిన ఘనత తమదేనని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇమాములు, మౌజన్లు, పాస్టర్ల కు పెండిరగ్లో ఉన్న గౌరవ వేతనం చెల్లింపులు చేసి ఖాతాల్లో జమ చేశామని, మైనా ర్టీలపై కూటమి ప్రభుత్వ వైఖరికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మైనారి టీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసిందే తప్ప వారి సంక్షేమం కోసం పైసా విదల్చ లేదని మంత్రి ధ్వజమెత్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనార్టీల స్వయం ఉపాధి కోసం రాయితీతో కూడిన బ్యాంకు రుణాలను కూటమి ప్రభుత్వం అందిస్తుందని పేర్కొ న్నారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.169.50 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, ఇందుకు దాదాపు సమానంగా రూ.173.02 కోట్ల బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని, మొత్తం రూ.342.52 కోట్లు అర్హులైన మైనారిటీల స్వయం ఉపాధికి ఖర్చు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. శిక్షణ మరియు ఉపాధి కోసం అదనంగా మరో రూ.24 కోట్లు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. ఉపాధి రాయితీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకోండి
మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ మైనారిటీల స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు పొందేందుకు ఓబీఎంఎంఎస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ వెబ్సైట్ మే 25 వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడిరచారు. మండల స్థాయి, పురపాలక స్థాయి స్క్రీనింగ్, సెలక్షన్ కమి టీలు ఎంపిక చేసిన తర్వాత సదరు బ్యాంకుల్లో లబ్ధిదారుడికి రెండు బ్యాంక్ ఖాతాలు, నాన్ ఆపరేటివ్ ఎస్బీ అకౌంట్, జీరో బ్యాలెన్స్ లోన్ అకౌంట్ తెరువపడతాయని తెలిపారు. జిల్లాల వారీగా కలెక్టర్లు అనుమతి ఇచ్చిన అనంతరం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్లు రుణాలు విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రుణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు యూనిట్లు గ్రౌండిరగ్ అయ్యాక వాటికి జియో ట్యాగింగ్ కూడా చేయడం జరుగుతుం దన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఏ ఒక్కరికి రుణం మంజూరు చేయలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 20,833 మందికి స్వయం ఉపాధి రుణాలు ఇస్తున్నామని తెలిపారు.